AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul Gandhi Defamation Case: రాహుల్‌ గాంధీ దోషే.. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పు.. రెండేళ్ల జైలు శిక్షకు ఛాన్స్..

2019 పరువు నష్టం కేసులో రాహుల్‌ గాంధీని దోషిగా తేల్చింది సూరత్‌ కోర్టు. 2019లో మోడీ ఇంటిపేరుపై రాహుల్‌ వివాదాస్పద కామెంట్స్‌ చేశారు. దొంగలందరికీ మోదీ ఇంటి పేరేనంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పేనని కోర్టు తేల్చి చెప్పింది.

Rahul Gandhi Defamation Case: రాహుల్‌ గాంధీ దోషే.. ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో తీర్పు.. రెండేళ్ల జైలు శిక్షకు ఛాన్స్..
Rahul Gandhi
Sanjay Kasula
|

Updated on: Mar 23, 2023 | 11:53 AM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి పేరుతో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దోషిగా తేల్చిచింది గుజరాత్ కోర్టు. 2019 ఎన్నికల సమయంలో ప్రదాని నరేంద్ర మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. దొంగలందరికీ మోదీ ఇంటి పేరేనంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు తప్పేనని కోర్టు తేల్చి చెప్పింది. గుజరాత్‌ మాజీ మంత్రి పూర్ణేష్‌ మోడీని ఉద్దేశించి రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. దొంగలందరూ మోదీ ఇంటిపేరుతోనే ఉన్నారెందుకు? అంటూ వ్యాఖ్యానించారు రాహుల్ గాంధీ. కర్ణాటకలోని కోలార్‌లో ఓ ఎన్నికల సభలో రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో పరువు నష్టం కేసును దాఖలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ. గత శుక్రవారం విచారణ ముగించి తీర్పును రిజర్వు చేసిన సూరత్ న్యాయస్థానం.

సార్వత్రిక ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వయనాడ్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యానించినప్పుడు ఈ కేసు 2019కి సంబంధించినది. ఆ తర్వాత అతనిపై పరువు నష్టం కేసు నమోదైంది. ‘దొంగలందరికీ మోదీ ఇంటిపేరు ఒక్కటే ఎందుకు?’ అని రాహుల్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే, గుజరాత్ మాజీ మంత్రి పూర్ణేష్ మోడీ పిటిషన్ దాఖలు చేశారు.

2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్నాటకలోని కోలార్‌ సభలో రాహుల్‌ ఈ కామెంట్స్‌ చేశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై క్రిమినల్‌ డెఫమెషన్‌ కేసు నమోదు చేశారు. రాహుల్‌పై పరువునష్టం దావా కేసుని విచారించిన సూరత్‌ కోర్టు రాహుల్‌ని దోషిగా నిర్ధారించింది.

రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించడం వల్ల ఆయన సభ్యత్వానికి ముప్పు ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో రెండేళ్ల శిక్షను కూడా ప్రకటించవచ్చు. అయితే కోర్టులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ‘నా ప్రకటన వల్ల ఎవరికీ నష్టం జరగలేదు. శిక్షను తగ్గించాలని కోర్టును ఆశ్రయించాను. మరోవైపు, అశ్విని చౌబే మాట్లాడుతూ, ‘రాహుల్ గాంధీ కోర్టు పరిధిలో ఉన్నారు. అతను కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నారు. పార్లమెంట్‌కు వచ్చి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా చేయలేదు. రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద నేరం నమోదు చేశారు. ఈ కేసులో ఇవాళ మూడోసారి కోర్టుకు హాజరయ్యారు. చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ కోర్టు గత వారం ఇరుపక్షాల వాదనలు విని మార్చి 23న తీర్పును ప్రకటించాలని నిర్ణయించింది. ఈరోజు విచారణ అనంతరం రాహుల్ గాంధీని దోషిగా కోర్టు తేల్చింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం