Rahul Gandhi: ఇల్లు, వాహనం లేదట.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?
సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో స్పీడును పెంచాయి. ఈ క్రమంలో కొన్ని రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాలకు జత చేసిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తం ఆస్తులు రూ. 20 కోట్లు కాగా.. వార్షిక ఆదాయం రూ. కోటిగా తెలిపారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సొంత ఇల్లు, వాహనం లేదు. కానీ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, కోట్ల మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు ఉన్నాయి. చరాస్తుల్లో రూ.4.33కోట్లు బాండ్లు-షేర్ల రూపంలో, రూ.3.81కోట్లు మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్నాయని రాహుల్ తెలిపారు. చరాస్తుల విలువ రూ.9.24 కోట్లు కాగా, స్థిరాస్తుల మొత్తం విలువ రూ.11.14 కోట్లుగా ఉందని తెలిపారు.
తన వద్ద రూ.26.25లక్షల బ్యాంకు డిపాజిట్లు, రూ. 61.52లక్షల విలువ చేసే నేషనల్ సేవింగ్స్ స్కీమ్, పోస్టల్ సేవింగ్స్, బీమా పాలసీలు, రూ.15.21లక్షల విలువైన గోల్డ్ బాండ్లు, రూ.4.20లక్షల విలువైన ఆభరణాలు, రూ.55వేల నగదు ఉన్నట్లు రాహుల్ గాంధీ అఫిడవిట్‌లో వెల్లడించారు. అయితే, రూ.2022-23లో తన వార్షిక ఆదాయం రూ.కోటిగా రాహుల్ ప్రకటించారు.
స్థిరాస్తుల్లో ఢిల్లీలోని మెహ్రౌలీలో వ్యవసాయ భూమి ఉన్నట్లు రాహుల్ తెలిపారు. ఇందులో సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు కూడా వాటాలున్నాయని .. ఇది తమకు వారసత్వంగా దక్కిన ఆస్తిగా వెల్లడించారు. ఇక గురుగ్రామ్‌లో రూ.9కోట్ల విలువ చేసే ఆఫీస్ ఉందని తెలిపారు. అంతేకాకుండా.. రూ.49.7లక్షల రుణాలు కూడా ఉన్నాయని ప్రకటించారు.
తనపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేసిన పరువు నష్టం కేసులు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌తో సంబంధం ఉన్న క్రిమినల్ కేసుల వంటి వివరాలను రాహుల్ గాంధీ నామినేషన్ పత్రాల్లో వెల్లడించారు.
సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా ఆస్తులు ఇవే..
కాగా.. వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై పోటీచేస్తున్న సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా కూడా బుధవారమే నామినేషన్ దాఖలు చేశారు. తనకు రూ.72లక్షల ఆస్తులు ఉన్నట్లు అన్నీ రాజా ప్రకటించారు. వారసత్వంగా వచ్చిన రూ.71లక్షల విలువైన ఆస్తి, రూ.10వేల నగదు, రూ.62వేల బ్యాంకు డిపాజిట్లు, రూ.25వేల విలువైన ఆభరణాలు ఉన్నాయని తెలిపారు.
కాగా.. కేరళలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న ఒకే దశలో ఓటింగ్ జరగనుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ నాలుగు లక్షల ఓట్ల భారీ ఆధిక్యంతో వాయనాడ్ స్థానంలో గెలుపొందారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..