Arunachal Pradesh: అరుణాచల్ లోని భూభాగాలకు కొత్త పేర్లు పెట్టిన చైనా

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై చైనా మరోసారి వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ, వాటి పేర్లు మారుస్తున్నట్లు తెలిపింది. 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి ఆ లిస్టును ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ పేరు మార్పులు మే 1 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటి నుంచి ఆయా ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని స్పష్టం చేసింది.

Arunachal Pradesh: అరుణాచల్ లోని భూభాగాలకు కొత్త పేర్లు పెట్టిన చైనా

|

Updated on: Apr 04, 2024 | 2:03 PM

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులపై చైనా మరోసారి వివాదాస్పద ప్రకటన చేసింది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు తమవేనంటూ, వాటి పేర్లు మారుస్తున్నట్లు తెలిపింది. 30 ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టి ఆ లిస్టును ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచింది. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ఈ పేరు మార్పులు మే 1 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటి నుంచి ఆయా ప్రాంతాలను కొత్త పేర్లతోనే పిలవాలని స్పష్టం చేసింది. చైనాకు చెందిన ప్రాంతాలకు విదేశీ పేర్లు ఉండడం వల్ల చైనా సార్వభౌమాధికార హక్కులకు భంగం కలిగించే ప్రమాదం ఉందని పేర్కొంది. అందుకే ఆ ప్రాంతాలను సొంత భాషలోనే పిలవాలని, విదేశీ భాషల నుంచి మాండరిన్ లోకి తర్జుమా చేయొద్దని తన ప్రజలకు సూచించింది. ఈ క్రమంలోనే విదేశీ పేర్లతో పిలుస్తున్న తమ భూభాగాలకు కొత్త పేర్లను పెడుతున్నట్లు చైనా ప్రభుత్వం పేర్కొందని గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎక్కువ సేపు సాక్స్ వేసుకుని ఉంటున్నారా.. ఈ అలెర్ట్ మీకే

కామెర్లను నయం చేసే దివ్య ఔషధం !! మరెన్నో లాభాలు !!

రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.. లాభాలు చూసి ఆశ్చర్యపోతారు

ఆఖరికి అమెరికా అధ్యక్షుడి విమానాన్నీ వదల్లేదు.. దొంగా.. దొంగా..

TOP 9 ET News: బన్నీ ఆస్తి విలువ 474 కోట్లు! | గుడ్ న్యూస్.. జక్కన్న రామాయణంలో అర్జునుడిగా

Follow us
Latest Articles