కామెర్లను నయం చేసే దివ్య ఔషధం !! మరెన్నో లాభాలు !!

కామెర్లను నయం చేసే దివ్య ఔషధం !! మరెన్నో లాభాలు !!

Phani CH

|

Updated on: Apr 04, 2024 | 2:01 PM

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రతిరోజూ ఆహారంలో పండ్లు కూడా తీసుకోవాలని డాక్లర్లు చెబుతుంటారు. అలాంటి పండ్లలో దానిమ్మ ఒకటి. ఇది అతి తక్కువ ధరలోనే దొరుకుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం. ఈ పండులో ముఖ్యంగా మెగ్నిషియం, సెలీనియం, జింక్ ఉంటుంది. అందుకే దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం దానిమ్మ పండులోనే కాదు దానిమ్మ చెట్టు ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. దానిమ్మ చెట్టు ఆకులతో కామెర్ల వ్యాధికి చెక్ పెట్టొచ్చు.

పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ప్రతిరోజూ ఆహారంలో పండ్లు కూడా తీసుకోవాలని డాక్లర్లు చెబుతుంటారు. అలాంటి పండ్లలో దానిమ్మ ఒకటి. ఇది అతి తక్కువ ధరలోనే దొరుకుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది దివ్య ఔషధం. ఈ పండులో ముఖ్యంగా మెగ్నిషియం, సెలీనియం, జింక్ ఉంటుంది. అందుకే దానిమ్మ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేవలం దానిమ్మ పండులోనే కాదు దానిమ్మ చెట్టు ఆకులలో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం. దానిమ్మ చెట్టు ఆకులతో కామెర్ల వ్యాధికి చెక్ పెట్టొచ్చు. దానిమ్మ ఆకులతో తయారు చేసిన కషాయం తీసుకోవడం వల్ల కామెర్లు తగ్గిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ కషాయం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జలుబు, దగ్గు సమస్యల నుంచి బయటపడతారు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దానిమ్మ ఆకులను ఆయుర్వేదంలో కూడా విస్తృతంగా వినియోగిస్తారు. ఈ కాలంలో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఇది విపరీతమైన స్ట్రెస్, ఇతర ఆరోగ్య కారణాలవల్ల కలుగుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు దానిమ్మ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి, అరగ్లాసు నీరు అయ్యేవరకూ మరిగించి, ఆ నీటిని రోజుకు రెండుసార్లు తాగాలి. ఇలా చేయడం వల్ల కామెర్లు, నిద్రలేమి సమస్యకు కూడా చెక్ పెట్టొచ్చు. దానిమ్మ ఆకులతో కషాయం మరో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దానిమ్మ ఆకులను ఎండబెట్టి పొడిచేసుకోవాలి. వీటిని నీటిలో వేసుకుని మరగకాచి తాగాలి. ఇది ప్రొస్టేట్ కేన్సర్‌కు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కేన్సర్ కణాలను సైతం నిరోధిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.. లాభాలు చూసి ఆశ్చర్యపోతారు

ఆఖరికి అమెరికా అధ్యక్షుడి విమానాన్నీ వదల్లేదు.. దొంగా.. దొంగా..

TOP 9 ET News: బన్నీ ఆస్తి విలువ 474 కోట్లు! | గుడ్ న్యూస్.. జక్కన్న రామాయణంలో అర్జునుడిగా

Vijay Deverakonda: ఇంకొకళ్ళు 200 కోట్లు కొడితే.. మనం కొట్టలేమా ఏంటి ??

NTR ఒప్పుకోకపోతే.. ఇంటి ముందు నిరాహార దీక్ష చేస్తా..