AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హోంమంత్రి అమిత్‌షాను కలిసిన రఘురామకృష్ణంరాజు కుమార్తె, కొడుకు.. కావాలనే వేధిస్తున్నారంటూ ఫిర్యాదు

Raghu Rama Krishna Raju:నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం

హోంమంత్రి అమిత్‌షాను కలిసిన రఘురామకృష్ణంరాజు కుమార్తె, కొడుకు.. కావాలనే వేధిస్తున్నారంటూ ఫిర్యాదు
Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: May 19, 2021 | 11:17 PM

Share

Raghu Rama Krishna Raju:నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం కాస్త కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్దకు చేరింది. బుధవారం రాఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్‌, కుమార్తె ఇందు ప్రియదర్శిని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. తన తండ్రిని జగన్‌ ప్రభుత్వం వేధిస్తోందని, ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. రగురామరాజును అరెస్ట్‌ చేయడం, ఆయనపై రాజద్రోహం కేసు మోపడం వెనుక కుట్ర ఉందంటూ అమిత్‌షాకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇందు ప్రియదర్శిని, భరత్‌ అమిత్‌షాకు ఇరువురు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు.

కాగా రఘురామకృష్ణంరాజుకు మంగళవారం సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. రఘురామకృష్ణరాజుకు ముగ్గురు వైద్యుల మెడికల్‌ బోర్డ్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించినట్లు నిన్న సికింద్రాబాద్ ఆర్మి ఆసుపత్రి వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సమక్షంలో ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నివేదికను తెలంగాణ హైకోర్టు జనరల్‌కు సీల్డ్‌ కవర్‌లో పంపనున్నారు. అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు ఈ నివేదికను చేరవేయనున్నారు. కాగా.. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు రఘురామకృష్ణంరాజు ఆర్మీ ఆసుపత్రిలోనే ఉండనున్నారు.

Also Read:

YSRCP VS JanaSena: గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. వైసీసీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ..

రియల్ హీరో నుంచి రీల్ హీరోగా మారనున్న సోనూసూద్.. పాన్ ఇండియా సినిమాతో సోనూ బాయ్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..