YSRCP VS JanaSena: గుంటూరు జిల్లాలో ఉద్రిక్తత.. వైసీసీ, జనసేన వర్గాల మధ్య ఘర్షణ..
JanaSena VS YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో
JanaSena VS YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు ముగిసినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో అధికార వైఎస్ఆర్ సీపీ, జనసేన కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. బుధవారం జిల్లాలోని నరసరావుపేట మండలం పమిడిపాడులో వైసీసీ, జనసేన వర్గాల మధ్య గొడవ చెలరేగింది.
పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఇరువర్గాల వారు పరస్పరం వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జనసేన, వైసీపీ వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఇరువర్గాల వారికి స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై రెండు వర్గాల వారు నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వైసీసీ వర్గీయులే ఈ గొడవకు కారణమని జనసేన సర్పంచ్ గౌషియా బేగం పేర్కొన్నారు. దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె వెల్లడించారు.
సర్పంచ్ ఎన్నికల్లో పమిడిపాడులో వైసీపీ బలపరిచిన అభ్యర్థిపై జనసేన కార్యకర్త గౌషియా బేగం గెలిచారు. అప్పటినుంచి జనసేన కార్యకర్తలపై వైసీపీ వర్గం దాడులు చేస్తుందని గౌషియా బేగం తెలిపారు.
Also Read: