Python: కోతిని మింగిన భారీ కొండచిలువ.. ఆ తర్వాత ఏం చేసిందంటే..?
Python swallows Monkey: ఓ భారీ కొండచిలువ ఏకంగా చెట్టుమీదున్న కోతిని మింగేసింది. ఆ తరువాత కదల్లేక నదిలోనే ఉండిపోయింది. దానిని గమనించిన
Python swallows Monkey: ఓ భారీ కొండచిలువ ఏకంగా చెట్టుమీదున్న కోతిని మింగేసింది. ఆ తరువాత కదల్లేక నదిలోనే ఉండిపోయింది. దానిని గమనించిన అటవీ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. పదడుగుల పొడవైన ఈ కొండచిలువను రెస్క్యూ చేసి మరి రక్షించారు. ఈ సంఘటన గుజరాత్‌లోని వడోదరలోని చిన్న నదిలో దీన్ని గుర్తించారు. అనంతరం ముగ్గురు అటవీ సిబ్బంది అతికష్టం మీద బయటకు తీశారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫైథాన్‌కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Gujarat Forest Department officials rescued a 10-foot long python from a small river in Vadodara.
“It had swallowed a monkey and later unswallowed it. Python is in a good situation. We will release it in jungle once permission is obtained,” said Shailesh Rawal, rescuer (09.08) pic.twitter.com/6DUUP00Ux9
— ANI (@ANI) August 10, 2021
కాగా.. కొండచిలువ కోతిని మింగిన తరువాత వాంతి చేసుకుందని గుజరాత్ అటవీ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం కదల్లేక నది ప్రాంతంలోనే ఆగినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పైథాన్ ఆరోగ్యం బాగానే ఉందని అటవీ అధికారి శైలేష్ రావల్ మీడియాకు వివరించారు. ప్రస్తుతం ఈ కొండ చిలువను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. బోనులో కొండచిలువ సురక్షితంగా ఉందని వెల్లడించారు. కాగా.. అటవీశాఖ అనుమతి పొందిన తర్వాత జంబుగోడా వన్యప్రాణుల అభయారణ్యంలో ఈ కొండచిలువను విడుదల చేస్తామని రావల్ తెలిపారు. కాగా.. ఈ ప్రాంతంలో కొండచిలువలు అధికంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
Also Read: