AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Punjab: ఇక జైళ్లలోనూ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు.. దేశంలోనే తొలిసారిగా..

జైళ్లు జీవితం అంటే ఎవరికైనా జీవితంలో అదో చేదు జ్ఞాపకమే. కొంతమంది కరడుగట్టిన నేరస్తులకు మాత్రం అది ఇష్టమైన ఇళ్లు. కాని చాలామంది ఏ నేరం చేయకుండానే పరిస్థితుల కారణంగా జైలు జీవితం అనుభవిస్తూ ఉంటారు. అయితే ఖైదీల్లో పరివర్తన కోసం ప్రభుత్వాలు వివిధ..

Punjab: ఇక జైళ్లలోనూ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు.. దేశంలోనే తొలిసారిగా..
Prisons
Amarnadh Daneti
|

Updated on: Sep 21, 2022 | 12:41 PM

Share

Punjab: జైళ్లు జీవితం అంటే ఎవరికైనా జీవితంలో అదో చేదు జ్ఞాపకమే. కొంతమంది కరడుగట్టిన నేరస్తులకు మాత్రం అది ఇష్టమైన ఇళ్లు. కాని చాలామంది ఏ నేరం చేయకుండానే పరిస్థితుల కారణంగా జైలు జీవితం అనుభవిస్తూ ఉంటారు. అయితే ఖైదీల్లో పరివర్తన కోసం ప్రభుత్వాలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనిలో భాగంగా పంజాబ్ ప్రభుత్వం ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఇక నుంచి జైళ్లలోనూ జీవిత భాగస్వామితో ఏకాంతంగా గడపొచ్చు. ఏంటి జైళ్లో జీవితభాగస్వామితో గడపడం ఏంటుంటున్నారా.. అయితే దీనికి కొన్ని షరతులున్నాయి. అవెంటో.. అసలు ఈనిర్ణయానికి కారణాలేంటో తెలుసుకుందాం. ఎంతోకాలంగా జైలు జీవితం గడుపుతోన్న ఖైదీల్లో మార్పు తెచ్చేందుకు పంజాబ్‌ జైళ్ల శాఖ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. జైళ్లో ఉన్న తమను చూసేందుకు వచ్చే భాగస్వామితో కొన్ని గంటలపాటు ఏకాంతంగా గడిపేందుకు (Conjugal Visits) వీలు కలిపించింది. ప్రతి మూడునెలలకు ఒకసారి ఖైదీలకు ఈ అవకాశాన్ని కల్పించనున్నట్లు పంజాబ్‌ ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్ ప్రభుత్వం తీసుకున్న ఈనిర్ణయంతో జైళ్లలో ఇటువంటి విధానం అమలు చేయడం దేశంలోని తొలిసారి కానుంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు మాత్రమే తమ భాగస్వామితో గడిపేందుకు వీలు కల్పించనున్నారు. దీనికోసం జైళ్లో ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. రెండు గంటలపాటు వీరిని ఏకాంతంగా ఉండనిస్తారు. ముఖ్యంగా సుదీర్ఘకాలంగా జైలు జీవితం అనుభవిస్తోన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇస్తారు. కరడుగట్టిన నేరస్థులు, గ్యాంగ్‌స్టర్‌లు, అధిక ముప్పు ఉన్న ఖైదీలు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్నవారికి మాత్రం ఈ సదుపాయాన్ని కల్పించరు. తొలుత ఈ విధానాన్ని (Conjugal Visits) గోయింద్వాల్‌ సాహిబ్‌లో ఉన్న కేంద్ర కరాగారం, నభాలోని నూతన జిల్లా జైలుతోపాటు భఠిండాలోని మహిళా జైళ్లలో అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర జైళ్లశాఖ వెల్లడించింది.

ఈ విధానం వల్ల వైవాహిక బంధాన్ని బలోపేతం చేయడంతోపాటు ఖైదీల ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నమని పేర్కొంది. ఇలా తమ భాగస్వామితో ఏకాంతంగా గడపాలి అనుకునేవారు పెళ్లి ధ్రువపత్రంతోపాటు ఖైదీని చూడడానికి వచ్చే ముందు కొవిడ్, లైంగిక సంబంధ, ఇతర అంటువ్యాధులు లేవని వైద్యుడి నుంచి ధ్రవీకరణ పత్రం తీసుకుని రావల్సి ఉంటుందని జైళ్ల శాఖ ప్రకటించింది. మొత్తంమీద పంజాబ్ ప్రభుత్వం ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ఓ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈనిర్ణయం ఎటువంటి ఫలితాల్ని ఇస్తుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్