AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Narendra Modi: విపత్కర పరిస్థితుల్లో తోడు నిలిచారు.. దేశ ప్రజలను అభినందించిన ప్రధాని మోడీ..

విపత్కర పరిస్థితుల్లో పీఎం కేర్స్ ఫండ్‌కు సహకరించిన దేశ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. అత్యవసర, ఆపద పరిస్థితుల్లో వెంటనే ప్రతిస్పందించే దృక్పథంతో పని చేయడానికి PM కేర్ ఫండ్ మరింత శ్రద్ధ వహిస్తుందన్నారు.

PM Narendra Modi: విపత్కర పరిస్థితుల్లో తోడు నిలిచారు.. దేశ ప్రజలను అభినందించిన ప్రధాని మోడీ..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2022 | 12:48 PM

Share

PM CARES Fund Trust: విపత్కర పరిస్థితుల్లో పీఎం కేర్స్ ఫండ్‌కు సహకరించిన దేశ ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. అత్యవసర, ఆపద పరిస్థితుల్లో వెంటనే ప్రతిస్పందించే దృక్పథంతో పని చేయడానికి PM కేర్ ఫండ్ మరింత శ్రద్ధ వహిస్తుందన్నారు. సహాయం ద్వారా మాత్రమే కాకుండా, ఉపశమన చర్యలు, సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుందని పీఎం మోడీ పేర్కొన్నారు. దేశానికి కీలకమైన సమయంలో పీఎం కేర్స్ ఫండ్ పోషించిన పాత్రను, ట్రస్టీలు అనుసరించిన విధానాలను పీఎం మోడీ ప్రశంసించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధక్షతన మంగళవారం PM CARES Fund బోర్డ్ ఆఫ్ ట్రస్టిస్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ పీఎం కేర్స్ ఫండ్ చేపడుతున్న కార్యక్రమాలపై పలు సూచనలు, సలహాలిచ్చిరు.

ఈ సందర్భంగా 4345 మంది పిల్లలకు సాయం అందించే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌తో సహా పీఎం కేర్స్ ఫండ్ సహాయంతో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై ప్రజెంటేషన్ నిర్వహించారు. అత్యవసర, ఆపద పరిస్థితులకు సమర్ధవంతంగా ప్రతిస్పందించడంపై PM CARESకు ప్రధాన దృష్టి ఉందని, కేవలం సహాయ సహాయం ద్వారా మాత్రమే కాకుండా ఉపశమన చర్యలు, సామర్థ్యాన్ని పెంపొందించడం లాంటి అంశాలపై ప్రధాని మోడీ చర్చించారు. పీఎం కేర్స్ ఫండ్‌లో అంతర్భాగమైన పలువురు ట్రస్టీలను కూడా ప్రధాని స్వాగతించారు.

ఈ సమావేశానికి PM CARES ఫండ్ ట్రస్టీలు.. చైర్మన్ ప్రధాని మోడీ సహా కేంద్ర హోం మంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రితోపాటు కొత్తగా నామినేట్ అయిన ట్రస్టీలు కూడా హాజరయ్యారు.

ఇవి కూడా చదవండి

కొత్తగా నామినేట్ అయిన ట్రస్టీలు..

  • జస్టిస్ కెటి థామస్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి
  • కరియా ముండా, మాజీ డిప్యూటీ స్పీకర్
  • రతన్ టాటా, ఎమెరిటస్ చైర్మన్, టాటా సన్స్

PM కేర్స్ ఫండ్‌ సలహా మండలి సభ్యులు వీరే..

  • రాజీవ్ మెహ్రిషి, భారత మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
  • సుధా మూర్తి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్‌పర్సన్
  • ఆనంద్ షా, టీచ్ ఫర్ ఇండియా సహ వ్యవస్థాపకుడు, ఇండికార్ప్స్, పిరమల్ ఫౌండేషన్ మాజీ CEO.

కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యం PM కేర్స్ ఫండ్ పనితీరుకు మరింత శక్తినిస్తుందని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రజా జీవితంలో వారి అపార అనుభవం వివిధ ప్రజా అవసరాలకు మరింత ప్రతిస్పందించేలా చేయడంలో మరింత శక్తిని అందిస్తుందన్నా్రు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..