AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: గుంతల రోడ్డుపై నవ వధువు ఫొటో షూట్‌.. వివాహ క్రతువులో సామాజిక బాధ్యత.. వీడియో వైరల్

ఓ యువతి తన వివాహ సమయంలోనూ సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఆలోచించింది. అంతేకాదు సమాజం పట్ల తనవంతు బాధ్యతను నిర్వర్తించి చూపించి అందరి ప్రశంసలు అందుకుంది.

Viral Video: గుంతల రోడ్డుపై నవ వధువు ఫొటో షూట్‌.. వివాహ క్రతువులో సామాజిక బాధ్యత.. వీడియో వైరల్
Wedding Photoshoot
Shaik Madar Saheb
|

Updated on: Sep 21, 2022 | 1:42 PM

Share

Wedding photoshoot: ఓ యువతి తన వివాహ సమయంలోనూ సమాజం పట్ల ఎంతో బాధ్యతగా ఆలోచించింది. అంతేకాదు సమాజం పట్ల తనవంతు బాధ్యతను నిర్వర్తించి చూపించి అందరి ప్రశంసలు అందుకుంది. కేరళకు చెందిన ఓ నవ వధువు తన వివాహం సందర్భంగా ఫోటోషూట్‌ చేసుకుంది. ఇక్కడ కూడా తన సామాజిక బాధ్యతను చాటుకుంది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన ఆ వధువు బంగారు ఆభరణాలు ధరించి పెళ్లికూతురిలా తయారై వర్షపు నీటితో నిండిపోయిన గుంతల రోడ్డుపై నడుస్తూ ఫోటోలు దిగింది. వాటిని చూసైనా ప్రభుత్వం స్పందించాలన్నది ఆమె కోరిక. ఈ వీడియో చూసి అందరూ ఆమెను అభినందిస్తున్నారు.

ఈ వెడ్డింగ్ ఫొటోషూట్ వైరల్ వీడియో, ఫోటోలను ఏరో వెడ్డింగ్‌ (arrow_weddingcompany) కంపెనీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో వాటికి విపరీతమైన స్పందన లభించింది. లక్షలమంది ఈ ఫోటోలు, వీడియోను వీక్షించారు. యువతికి సమాజం పట్ల ఉన్న బాధ్యతకు ప్రశంసలతో ముంచెత్తారు. సెప్టెంబర్ 11న షేర్ చేసినప్పటి నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో 4.1 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. 3.6 లక్షల లైక్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి, గుంతల కారణంగా జరుగుతున్న ప్రమాదాల్లో.. పెరుగుతున్న మరణాల సంఖ్యపై కేరళ హైకోర్టు ఇటీవల లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రంలోని గుంతలతో ఇంకెంత మంది చనిపోవాలని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఈ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..