Buprenorphine Scam: ఎఫ్‌డీఏ ఆఫీసర్ నేహా హత్య కేసులో వీడని మిస్టరీ.. రూ.100 కోట్ల కుంభకోణం దర్యాప్తులో ఖాఖీల అశ్రద్ధ
పంజాబ్ ఎఫ్‌డీఏ ఆఫీసర్ నేహా శౌరీ హత్య కేసులో ఆమె కుటుంబం ఇంకా న్యాయపోరాటం చేస్తూనే ఉంది. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన నేహా హత్యపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విచారణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.1971 ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ కైలాష్ కుమార్ శౌరీ కుమార్తె నేహా. 2019లో పంజాబ్ ఎఫ్‌డిఎ అధికారిణి నేహా శౌరీని మొహాలిలోని ఖరార్‌లో డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీగా నియమించారు. ఆ సమయంలో నేహా కీలకమైన..
చండీఘడ్, సెప్టెంబర్ 13: పంజాబ్ ఎఫ్‌డీఏ ఆఫీసర్ నేహా శౌరీ హత్య కేసులో ఆమె కుటుంబం ఇంకా న్యాయపోరాటం చేస్తూనే ఉంది. నాలుగున్నరేళ్ల క్రితం జరిగిన నేహా హత్యపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. విచారణలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.1971 ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ కైలాష్ కుమార్ శౌరీ కుమార్తె నేహా. 2019లో పంజాబ్ ఎఫ్‌డిఎ అధికారిణి నేహా శౌరీని మొహాలిలోని ఖరార్‌లో డ్రగ్ లైసెన్సింగ్ అథారిటీగా నియమించారు. ఆ సమయంలో నేహా కీలకమైన ఆధారలను సేకరించారు. దీంతో డ్రగ్ మాఫియాను మార్చి 29, 2019న అరెస్టు చేశారు. అదే రోజున నేహా షోరిపై ఆమె కార్యాలయంలోనే దుండగులు కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు తమను తాము కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు కేసును మూసివేశారు.
పోలీసులు చెప్పి కథ ఒకలా.. వాస్తవం మరోలా..
నిందితుడు బల్వీందర్ సింగ్ రూపనగర్‌లోని మోరిండాలో కెమిస్ట్ షాప్ నడుపుతున్నాడు. 2009లో ఎఫ్‌డిఎ బృందం అతని షాప్‌పై దాడి చేసింది. నేహా కూడా ఆ బృందంలో ఉంది. ఆ సమయంలో ఆమె ప్రొబేషనర్. అనధికార మందులను విక్రయించాడనే ఆరోపణలపై ఎఫ్‌డిఎ బృందం బల్వీందర్ సింగ్‌ను అరెస్టు చేసింది. దీని తరువాత, FDA నిందితుల కెమిస్ట్ షాప్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. పదేళ్ల తర్వాత నిందితుడు తన భార్య పేరిట మరో లైసెన్స్ తీసుకోవడానికి యత్నించాడు. కానీ ఆ దరఖాస్తును FDA తిరస్కరించింది. దీంతో నేహాపై బల్వీందర్ వ్యక్తిగత కక్ష్య పెంచుకున్నాడని, అందుకే నేహను చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
రూ.100 కోట్ల బుప్రెనార్ఫిన్ కుంభకోణంపై ఫిర్యాదు చేస్తూ అదే రోజు..
FDA అధికారి నేహా శౌరీ జూలై 14, 2018న అంతర్గత నివేదికను అప్పటి డ్రగ్ కంట్రోలర్‌కు సమర్పించారు. ఇందులో ప్రైవేట్ డి-అడిక్షన్ సెంటర్లలో బుప్రెనార్ఫిన్, ఇతర మందుల దుర్వినియోగం గురించిన సమాచారం ఉంది. నేహా హత్యకు ఆమె తండ్రి కెప్టెన్ కైలాష్ కుమార్ శౌరీ, ఇతర కుటుంబ సభ్యులే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదిలా ఉంటే అవినీతి రాజకీయ నాయకులు, పోలీసు అధికారులు, ప్రైవేట్ డి-అడిక్షన్ సెంటర్ల మధ్య కనెక్షన్ ఉందని, ఎలాంటి పత్రాలు లేకుండానే కోట్ల రూపాయల్లో బుప్రెనార్ఫిన్ మందులను విక్రయించినట్లు విచారణలో తేలింది. 2019లో పంజాబ్‌లోని 23 ప్రైవేట్ డీ-అడిక్షన్ సెంటర్లు ఎలాంటి రికార్డులు లేకుండా రూ.100 కోట్ల విలువైన ఐదు కోట్ల బుప్రెనార్ఫిన్ మందులు విక్రయించినట్లు విచారణలో తేలింది.
బుప్రెనార్ఫిన్ ఓపియాయిడ్ అగోనిస్ట్ నల్లమందు వంటి ప్రభావాలను కలిగి ఉన్నందున, వినోద ప్రయోజనాల కోసం ఔషధం దుర్వినియోగం చేయబడిందని దర్యాప్తులో బయటపడింది. చికిత్సలో భాగంగా ఈ మందులను వాడిన వారిలో 17 శాతం మంది డ్రగ్స్‌కు బానిసైనట్లు పంజాబ్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. బుప్రెనార్ఫిన్ కుంభకోణం కేసులో పంజాబ్‌లోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న EDకి సహకరించడానికి బదులు, బుప్రెనార్ఫిన్ కొనుగోలు, పంపిణీ పత్రాలను అందజేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఏజెన్సీని తప్పుదారి పట్టించేందుకు అధికారులు, ప్రైవేట్ డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా డ్రగ్స్ వినియోగ డేటాను కూడా తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఈ వ్యవహారం పంజాబ్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది.
ఈ కేసులో వాస్తవాలు సాక్ష్యాల ఆధారంగా తిరిగి దర్యాప్తు చేయాలని హర్యానా హైకోర్టులో నేహా శౌరీ తల్లిదండ్రులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయాలని నేహా తండ్రి కెప్టెన్ కైలాష్ కుమార్ శౌరీ డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసు 20 – 22 సార్లు విచారణకు వచ్చినప్పటికీ వాయిదా పడుతూనే వచ్చింది. నేహాతో పాటు మరొకరిని కూడా నిందితుడు బల్వీందర్ హత్య చేసినట్లు నేహా తండ్రి ఆరోపించారు. నేహాను హత్య చేసిన ఇద్దరు నిందితులను ఎవరో కాల్చి చంపారని, వారి దేహాలపై ఉన్నబెల్లెట్ గాయాలే అందుకు సాక్ష్యం అని పేర్కొన్నారు. అంతేకాకుండా నేహా మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్ డేటా కూడా తొలగించారు. నేహా మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్ కనిపించకుండా పోవడం వంటి వివరాలను పోలీసులు పంచుకోలేదు. అంతేకాకుండా నేహా సహోద్యోగులను ఎందుకు విచారించలేదు? కేసును ఎందుకు ఫోరెన్సికల్ దర్యాప్తు చేయలేదంటూ ప్రశ్నలు లేవనెత్తారు. నా కుమార్తెను పట్టపగలు హత్య చేశారు. కానీ ఇప్పటి వరకూ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.