పంజాబ్ కాంగ్రెస్ లో చల్లారని సంక్షోభం..రేపు సోనియా గాంధీతో భేటీ కానున్న సీఎం అమరేందర్ సింగ్ .?
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. సీఎం అమరేందర్ సింగ్ మంగళవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ శాఖలో తలెత్తిన క్రైసిస్ ను పరిష్కరించే యత్నంలో భాగంగా సోనియా.. అమరేందర్ సింగ్ ఓ రాజీ ఫార్ములాను రూపొందించవచ్చునని భావిస్తున్నారు.
పంజాబ్ కాంగ్రెస్ లో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. సీఎం అమరేందర్ సింగ్ మంగళవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ శాఖలో తలెత్తిన క్రైసిస్ ను పరిష్కరించే యత్నంలో భాగంగా సోనియా.. అమరేందర్ సింగ్ ఓ రాజీ ఫార్ములాను రూపొందించవచ్చునని భావిస్తున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు ను బుజ్జగించి.. ఆయనకు కీలకమైన పదవిని పార్టీ అధిష్టానం కట్టబెట్టవచ్చునని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఆయనను డెప్యూటీ సీఎం గానో లేదా పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ గానో నియమించిన పక్షంలో అది తనకు ఏ మాత్రం సమ్మతం కాదని అమరేందర్ సింగ్ ఖరా ఖండిగా చెబుతున్నారు. తన వైఖరిని రేపు ఆయన సోనియా గాంధీకి వివరించవచ్చునని తెలుస్తోంది. ఇటీవల సిద్దు రాహుల్ గాంధీ తోను, ప్రియాంక గాంధీ తో కూడా సమావేశమై చర్చలు జరిపారు. ఆ సమయంలో కూడా పార్టీ రాజీ సూత్రాన్ని రూపొందించినట్టు సమాచారం. దానికి సిద్దు అంగీకరించినట్టు కూడా తెలిసింది.
అయితే రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సంక్షోభానికి ముఖ్యమంత్రే కారకుడని సిద్దు పదేపదే ఆరోపిస్తున్న వేళ..ఇద్దరి మధ్యా సఖ్యత కుదురుతుందా అన్నది అనుమానమే అంటున్నారు. పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రంలో తలెత్తిన ఈ క్రైసిస్ ను పార్టీ నాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాలంటున్నారు. సీఎం అమరేందర్ సింగ్ అనుకూల, వ్యతిరేక వర్గాలను కూడా పార్టీ అధిష్ఠానం పిలిపించి వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవచ్చునని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: రంగంలోకి దిగిన యాక్షన్ కింగ్..!సర్కారు వారి పాటకు స్పెషల్ అట్రాక్షన్ నిలవనున్న అర్జున్ :Arjun in Sarkaru Vaari Paata video.