Covid Victims Park: కోవిడ్ మృతుల స్మారక కట్టడం.. పార్కును నిర్మించే పనిలో రాష్ట్ర సర్కార్..

కోవిడ్ మృతుల చితాభస్మంతో ఓ పార్కును నిర్మించనున్నట్లుగా ప్రకటన చేసింది మధ్యప్రదేశ్ సర్కార్. ఈ ఉద్యానవనంలో నాలుగు వేలకుపైగా వివిధ రకాల మొక్కలను నాటాలని నిర్ణయించారు.

Covid Victims Park: కోవిడ్ మృతుల స్మారక కట్టడం.. పార్కును నిర్మించే పనిలో రాష్ట్ర సర్కార్..
Bhopal Covid Victims Park
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 05, 2021 | 9:04 PM

కోవిడ్ మృతులకు గుర్తుగా మధ్యప్రదేశ్ సర్కార్ ఓ మంచి ఆలోచనతో ముందుకు వెళ్తోంది. ఆ సర్కార్ చేసిన ఆలోచన ప్రశంసలకు కారణంగా మారుతోంది. కోవిడ్ సెకెండ్ వేవ్ ఉద్ధృతి సమయంలో చనిపోయినవారి గుర్తుగా వారు ఈ ఆలోచన చేశారు.  వారి గుర్తుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ స్మారక కట్టడాన్ని నిర్మించనుంది. కోవిడ్ మృతుల చితాభస్మంతో ఓ పార్కును నిర్మించనున్నట్లుగా ప్రకటన చేసింది. ఇదే ఆ రాష్ట్ర ప్రజలతోపాటు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.  భోపాల్‌లోని భద్భద విశ్రామ్ ఘాట్ స్మశానికి సమీపంలో 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేయనున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ఏడాది మార్చి 15 నుంచి జూన్ 15 మధ్య 6వేలకు పైగా కరోనా మృతదేహాలకు ఈ స్మశానంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అంత్యక్రియల అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు తమ వారి అస్థికలను మాత్రమే తీసుకెళ్ళారు. కానీ.. కోవిడ్ నిబంధనల కారణంగా చితాభస్మాన్ని అక్కడే వదిలేశారు.

ఇలా కోవిడ్ మృతుల చితాభస్మం వదిలేయడంతో అది కాస్తా దాదాపు 21 ట్రక్కుల్లో నిండిపోయిందంట. దీనిని నర్మదా నదిలో లేదా కాలువలలో పారబోస్తే వాతావరణానికి ఇబ్బంది ఏర్పడుతుందని భావించిన అక్కడి సర్కార్. దీంతో వారి స్మారాకర్థం ఓ పార్కును నిర్మించేందుకు ప్లాన్ చేసినట్లుగా వెల్లడించారు. ఈ ఉద్యానవనంలో నాలుగు వేలకుపైగా వివిధ రకాల మొక్కలను నాటాలని నిర్ణయించారు. ఈ మెమోరియల్ పార్క్ ఏర్పాటు కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి : Shocking: 10 అడుగుల అరుదైన భారీ త్రాచుపాము.. నడ్డిరోడ్డుపై హాల్‌చల్.. గగుర్పొడిచే దృశ్యాలు వైరల్

Khammam District: దేవత విగ్రహంపై పడగ విప్పిన ఆడిన నాగు పాము.. గంట పాటు పూజలు చేసినా…