AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Exams: సరికొత్త విధానానికి తెర తీస్తోన్న సీబీఎస్‌ఈ.. ఒకే ఏడాదిలో రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలని.

CBSE Exams: కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే...

CBSE Exams: సరికొత్త విధానానికి తెర తీస్తోన్న సీబీఎస్‌ఈ.. ఒకే ఏడాదిలో రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలని.
Cbse Exams
Narender Vaitla
|

Updated on: Jul 05, 2021 | 9:18 PM

Share

CBSE Exams: కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి రెండు వేవ్‌ల కారణంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో పరీక్షలను రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలోనే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సిలబస్‌ ఎడ్యుకేషన్‌ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే 2021-2020 అకాడమిక్‌ ఇయర్‌కు గాను రెండు బోర్డ్‌ ఎగ్జామ్‌లను నిర్వహించాలని ఆలోచిస్తోంది. ఇకే బోర్డ్‌ ఎగ్జామ్‌ ఉండడం వల్ల పరీక్షలు రద్దు వంటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కాబట్టి రెండు బోర్డ్‌ ఎగ్జామ్స్‌ను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

టర్మ్‌1, టర్మ్‌ 2 పేరుతో ఈ పరీక్షలను నిర్వహించాలని బోర్డ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త విధానం ద్వారా ఒకే ఏడాది రెండు బోర్డు పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ రెండు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఫలితాలను విడదుల చేస్తారు. ఇక సిలబస్‌ విషయానికొస్తే.. రెండు టర్ముల్లో సిలబస్‌ వేరు వేరుగా ఉంటుంది. మొదటి టర్మ్‌ పరీక్షను 50 శాతం సిలబస్‌తో రెండవ టర్మ్‌ పరీక్షను మిగతా 50 శాతం సిలబస్‌తో నిర్వహిస్తారు. పరీక్షల సమయాన్ని 90 నిమిషాలుగా నిర్ణయించారు. బోర్డు నియమించిన అధికారుల సమక్షంలోనే ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇక మొదటి టర్మ్‌ పరీక్షను నవంబరు – డిసెంబర్ మధ్య కాలంలో, రెండవ టర్మ్‌ పరీక్షను మార్చి-ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. పరీక్ష విధానంతో పాటు పరీక్ష పేపర్‌ను కూడా మార్చనున్నారు. మొదటి టర్మ్‌ ఫస్ట్‌ పేపర్‌లో మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. అలాగే సెకండ్‌ పేపర్‌లో విభిన్న రకమైన ప్రశ్నలు ఇస్తారు. దీనికి అనుగుణంగానే సిలబస్‌ను కూడా రూపొందించనున్నారు. మరి సీబీఎస్‌ఈ తీసుకురావాలని భావిస్తోన్న ఈ నూతన విధానం అమల్లోకి వస్తుందో లేదో చూడాలి.

Also Read: Covid Victims Park: కోవిడ్ మృతుల స్మారక కట్టడం.. పార్కును నిర్మించే పనిలో రాష్ట్ర సర్కార్..

ఇక్కడ పోటీ చేయాలని ఎంత ప్రయత్నించినా వీలుకాలేదు. కానీ.. యూపీలో ఏకంగా జిల్లా పీఠాన్నే కైవసం చేసుకుంది. ఇంతకీ ఎవరీమె.?

Modi Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! ప్రాబబుల్స్‌లో ఎవరున్నారంటే..!

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..