Modi Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! ప్రాబబుల్స్‌లో ఎవరున్నారంటే..!

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లోనే కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరుగనుంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వస్తుందని సంకేతాలొస్తున్నాయి. అయితే ఎవరు ఇన్‌..ఎవరు ఔట్..

Modi Cabinet Expansion 2021: కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! ప్రాబబుల్స్‌లో ఎవరున్నారంటే..!
PM MODI
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 05, 2021 | 8:31 PM

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండ్రోజుల్లోనే కేంద్ర కేబినెట్‌ విస్తరణ జరుగనుంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన వస్తుందని సంకేతాలొస్తున్నాయి. అయితే ఎవరు ఇన్‌..ఎవరు ఔట్.. ప్రధాని మోడీ తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పిస్తారనే అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై ప్రధాని మోదీ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. మంత్రుల పనితీరు ఆధారంగా తుది జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఐతే ఈసారి ఉత్తరప్రదేశ్‌కు ప్రాధాన్యత ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

విస్తరణకు సమయం కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జులై 7న (బుధ‌వారం) మ‌ధ్యాహ్నం 11 గంట‌ల‌కు ప్రధాని మోడీ 2.0 ప్రభుత్వం తొలిసారి కేబినెట్ విస్తర‌ణ చేపట్టనుందని ఢిల్లీ వర్గాల అంచనా వేస్తున్నాయి. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా మంత్రివర్గంలో మార్పులు జరుగనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో గరిష్టంగా 81 మంది మంత్రులను స్థానం ఉండగా, ప్రస్తుతం 53 మంది మాత్రమే ఉన్నారు. దీంతో మరో 28 మందికి మంత్రులుగా అవకాశం దక్కనుంది.

కేబినెట్ విస్తర‌ణ‌పై గత రెండు రోజులుగా ప్రధానితో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ సంస్థాగ‌త ప్రధాన కార్యద‌ర్శి బీఎల్ సంతోష్‌ల‌తో చ‌ర్చలు జ‌రుపుతున్నారు. కేబినెట్ విస్తర‌ణ‌లో ఉత్తర్‌ప్రదేశ్‌తోపాటు బీహార్‌, మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రాల‌కు ప్రాతినిధ్యం ల‌భిస్తుంద‌ని తెలుస్తుంది. ఇందులో ముగ్గురు మాజీ సీఎంలు, ఓ మాజీ డిప్యూటీ సీఎంకు చోటు లభిస్తుందని సమాచారం. ఉత్తరాఖండ్ మాజీ సీఎం తీర‌త్ సింగ్ రావ‌త్, అసోం మాజీ ముఖ్యమంత్రి శ‌ర్బానంద సోనోవాల్‌, మ‌హారాష్ట్ర మాజీ సీఎం నారాయ‌ణ్ రాణేలకు బెర్త్ లభించనుంది.

ఉత్తరప్రదేశ్‌ నుంచి వరుణ్‌ గాంధీ, రీటా బహుగుణ జోషితో పాటు మరికొందరి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక మధ్యప్రదేశ్‌ నుంచి జ్యోతిరాదిత్య సింధియా, అస్సాం నుంచి శర్వానంద్‌ సోనోవాల్‌లతో పాటు బీహార్‌ డిప్యూటీ సీఎం సుశీల్‌ మోదీలకు కొత్తగా మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ప్రచారం జరుగుతోంది. ఇక బీహార్‌, గుజరాత్‌ల ఇన్‌ఛార్జిగా ఉన్న బీజేపీ సీనియర్‌ నేత భూపేంద్ర యాదవ్‌కు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక ఇటీవలే లోక్‌ జనశక్తి నుంచి బయటికొచ్చిన పరాస్‌, అప్నాదళ్‌ నేత అనుప్రియ పటేల్‌ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జేడీయూ నుంచి లల్లాన్‌ సింగ్‌, రామ్‌నాథ్‌ ఠాకూర్‌, సంతోష్‌ కుశ్వాహాలకు అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Shocking: 10 అడుగుల అరుదైన భారీ త్రాచుపాము.. నడ్డిరోడ్డుపై హాల్‌చల్.. గగుర్పొడిచే దృశ్యాలు వైరల్

Khammam District: దేవత విగ్రహంపై పడగ విప్పిన ఆడిన నాగు పాము.. గంట పాటు పూజలు చేసినా…

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
రెస్టారెంట్ స్టైల్ చికెన్ టిక్కా.. ఇంట్లో కూడా చేసుకోవచ్చు..
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
యంగ్ హీరోస్ కంటే స్పీడ్ లో రజినీకాంత్.! రెస్ట్ మోడ్‌ని పాజ్‌ లో.?
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
అప్పుడు బ్యాగ్రౌండ్ డ్యాన్సర్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్..
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
నీటిలో పడిన మొబైల్‌ను బియ్యంలో ఉంచితే మంచిదా?
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ఏం టాలెంట్ భయ్యా.. ఆవాలతో మాజీ ప్రధాని ఆర్ట్
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
ది రాజా సాబ్ నిర్మాతల కొత్త సినిమా.. మళ్లీ స్టార్ హీరోతోనే..
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
చైనాలో కొత్త రకం ఉద్యోగం.. శవాలతో పది నిమిషాలు ఉంటే!
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
జోరు తగ్గేసరికి.. రేసు నుంచి తప్పుకుందనుకుంటున్నారా? చిన్న గ్యాప్
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
బస్సు డ్రైవర్ కొడుకు.. బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టిన హీరో..
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!