AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ నేరం అతనిది కాదు.. గాలిపై కేసు పెట్టుకోండి..!

చెన్నైలో హోర్డింగ్ కూలి ఓ యువతి మృతిచెందిన ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు అన్నాడిఎంకే స్దానిక నాయకుడు జయగోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 12న డ్యూటీ ముగించుకుని వస్తున్న శుభశ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ద్విచక్రవాహనంపై వస్తుండగా.. రోడ్డు మధ్య ఉన్న డివైడర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆమె పై ఊడిపడింది. దీంతో శుభశ్రీ తన బైక్‌తో సహా కిందపడిపోయింది. హోర్డింగ్ కింద ఆమె ఉండిపోవడంతో వెనుక వస్తున్న లారీ.. శుభశ్రీ పైనుంచి వెళ్లిపోయింది. […]

ఈ నేరం అతనిది కాదు.. గాలిపై కేసు పెట్టుకోండి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 07, 2019 | 1:59 PM

Share

చెన్నైలో హోర్డింగ్ కూలి ఓ యువతి మృతిచెందిన ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడు అన్నాడిఎంకే స్దానిక నాయకుడు జయగోపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 12న డ్యూటీ ముగించుకుని వస్తున్న శుభశ్రీ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన ద్విచక్రవాహనంపై వస్తుండగా.. రోడ్డు మధ్య ఉన్న డివైడర్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఆమె పై ఊడిపడింది. దీంతో శుభశ్రీ తన బైక్‌తో సహా కిందపడిపోయింది. హోర్డింగ్ కింద ఆమె ఉండిపోవడంతో వెనుక వస్తున్న లారీ.. శుభశ్రీ పైనుంచి వెళ్లిపోయింది. ఈ దారుణ ఘటనలో ఆ యువతి తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది.

అన్నా డీఎంకే పార్టీకి చెందిన స్ధానిక నేత జయగోపాల్ అనే వ్యక్తి ఈ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశాడు. శుభశ్రీ మృతి కేసులో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆపార్టీకి చెందిన మరో సీనియర్ నేత పొన్నయన్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హోర్డింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఆమె మరణించలేదు.. ఆ సమయంలో బలంగా గాలి వీయడంతో అది ఊడి ఆమెపై పడటంతోనే ఆమె మృతి చెందిందన్నారు. ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే .. బలంగా వీచి.. హోర్డింగ్‌ను కూల్చిన గాలిపైనే కేసు పెట్టాలన్నారు. ఇదిలా ఉంటే పొన్నయన్ వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. హోర్డింగ్ కారణంగా ఓ నిండు ప్రాణం పోయినందుకు బాధపడకుండా.. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శిస్తున్నారు.

హోర్డింగ్ కూలి శుభశ్రీ మ‌ృతి చెందడంపై మద్రాస్ హోకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. మరోవైపు డీఎంకే పార్టీ చీఫ్ స్టాలిన్ ఇంకాస్త ముందుకెళ్లి ప్లెక్సీ బోర్డులు పెట్టవద్దంటూ పార్టీ శ్రేణులకు ఆదేశాలు జారీచేశారు. శుభశ్రీ మరణంతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
ఆహారంలో టమాటా తీసుకుంటే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?