AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్గాపూజా ఉత్సవాల్లో రాజకీయాలు.. బెంగాల్ లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్

పశ్చిమ బెంగాల్ లో దసరా పండుగ ఉత్సవాలు ఎన్నడూ లేనివిధంగా ఈ సారి పొలిటికల్ కలర్ ని సంతరించుకోనున్నాయి. దుర్గామాత విగ్రహాల ఏర్పాటు నుంచి భారీ పందిళ్ళ వరకు.. అడుగడుగునా ఈ సందర్భంగా ‘ రాజకీయ క్రీనీడలు ‘ కనిపించబోతున్నాయి.కేవలం ఈ ఉత్సవాల నిర్వహణకు సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం 92 కోట్లను కేటాయించడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరో రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటినుంచే మమత ప్రభుత్వం […]

దుర్గాపూజా ఉత్సవాల్లో రాజకీయాలు.. బెంగాల్ లో  బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్
Anil kumar poka
| Edited By: |

Updated on: Oct 07, 2019 | 3:28 PM

Share

పశ్చిమ బెంగాల్ లో దసరా పండుగ ఉత్సవాలు ఎన్నడూ లేనివిధంగా ఈ సారి పొలిటికల్ కలర్ ని సంతరించుకోనున్నాయి. దుర్గామాత విగ్రహాల ఏర్పాటు నుంచి భారీ పందిళ్ళ వరకు.. అడుగడుగునా ఈ సందర్భంగా ‘ రాజకీయ క్రీనీడలు ‘ కనిపించబోతున్నాయి.కేవలం ఈ ఉత్సవాల నిర్వహణకు సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం 92 కోట్లను కేటాయించడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరో రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇప్పటినుంచే మమత ప్రభుత్వం ఈ ఉత్సవాల పేరిట వ్యూహం పన్నుతోందని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి.

బాగ్ బజార్ వంటి చోట్ల భారీ దుర్గామాత విగ్రహాలను ఏర్పాటు చేయడం, నగర మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని మొత్తం ఈ సెలబ్రేషన్స్ లో వినియోగించడం, చివరకు పండుగ అనంతరం జరగబోయే నిమజ్జన వేడుకల్లోనూ టీఎంసి నేతల ‘ జోరు ‘ కు ఇప్పటినుంచే పథకాలు రచించడం వంటివాటిని కమలనాథులు నిశితంగా గమనిస్తున్నారు. అసలు ఇలాంటి పండుగలకు ‘ రాజకీయ పునాది ‘ 1938 ప్రాంతంలోనే పడింది. అది 1938… 39 సంవత్సరం.. అప్పటి నగర మేయర్ గా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్.. బాగ్ బజార్ పూజా కమిటీ చైర్మన్ హోదాలో ఈ ఉత్సవాలను నిర్వహించారు. అప్పటి నుంచి వీటికి రాజకీయ ‘ రంగు ‘ పడింది. అంతకుముందు కలకత్తా కార్పొరేషన్ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తూ వచ్చారు.

అసలు ఈ పూజోత్సవాల్లో రాజకీయాలకు తావు లేదని మమత సర్కార్ ప్రకటించింది. ఇది సంప్రదాయమని స్పష్టం చేసింది ఇదే అదనుగా బీజేపీ రంగంలోకి దిగింది. విలాసవంతమైన.. పోష్ సాల్ట్ లేక్ వద్ద బీజేపీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా దసరా ఉత్సవాలను ప్రారంభించనున్నారు. అయితే ఇదంతా ఓ ‘ ఎత్తుగడ ‘ గా అధికార తృణమూల్ కాంగ్రెస్ అంటోంది. పైగా నిమజ్జనం రోజున దుర్గామాత విగ్రహాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాలి ఉంటుందని కోల్ కతా బీజేపీ నాయకులు హెచ్ఛరించడం కూడా ఇందులో భాగమేనని టీఎంసి నేతలు దుయ్యబడుతున్నారు. ఇలాంటి చర్యలను ఎలా ఎదుర్కోవాలో తమకు బాగా తెలుసునని సవాలు విసురుతున్నారు. దీంతో ఈ దసరా ఉత్సవాలు బెంగాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య ‘ పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న ‘ చందాన పరిస్థితిని సృష్టిస్తోంది.

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..