Public Holiday: సెప్టెంబర్ 18న కూడా సెలవు ప్రకటించిన ఆ ప్రభుత్వం.. కారణం ఏంటంటే..
Public Holiday: వరుస సెలవులతో విద్యార్థులకు పండగే.. పండగ. రెండో శనివారం, ఆదివారం, వినాయక నిమజ్జనం, ఈద్-ఎ-మిలాద్ ఇలా వరుస సెలవులు రావడంతో విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఎంజాయ్ చేయనున్నారు..
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఈద్-ఎ-మిలాద్ సెలవును వాయిదా వేసింది. ఇప్పుడు ఈ సందర్భంగా ముంబై సెప్టెంబరు 16కి బదులు సెప్టెంబర్ 18న సెలవు రోజుగా ప్రకటించింది. ఆ రోజు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ఉండనుంది. ముస్లిం సమాజానికి చెందిన స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈద్-ఎ-మిలాద్‌కు సెప్టెంబర్ 16కి బదులుగా సెప్టెంబర్ 18న సెలవు ప్రకటించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నసీం ఖాన్ ఇటీవల ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు విజ్ఞప్తి చేశారు. వార్తా సంస్థ PTI నివేదిక ప్రకారం.. సెప్టెంబరు 17న, ముస్లిం సమాజం సెప్టెంబర్ 18న ఈద్-ఇ-మిలాద్ ఊరేగింపును నిర్వహించాలని నిర్ణయించుకుంది. తద్వారా రెండు పండుగలను వైభవంగా, ఉత్సాహంగా జరుపుకోవచ్చు. గణేష్ ఉత్సవ్ చివరి రోజు సెప్టెంబర్ 17 న వస్తుంది. ఈద్-ఇ-మిలాద్ సెప్టెంబర్ 16 న ఉంది. అయితే ఇది చంద్రుని స్థానం ప్రకారం కూడా మారవచ్చు. మైనార్టీ నాయకుల లేఖతో ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఈద్-ఎ-మిలాద్ అధికారిక సెలవును సెప్టెంబర్ 16 నుండి సెప్టెంబర్ 18 వరకు పొడిగించింది. దాని అధికారిక ప్రకటన కూడా వచ్చింది. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 1) పంకజ్ దహనే ప్రకారం, గత సంవత్సరం కూడా ముస్లిం సమాజం గణపతి నిమజ్జనాన్ని పూర్తి ఉత్సాహంతో జరుపుకోవడానికి వీలుగా తమ మతపరమైన కార్యకలాపాలను రీషెడ్యూల్ చేయాలని అభ్యర్థించింది. ఇది ఇరు వర్గాల ఐక్యతను తెలియజేస్తోందన్నారు. ముంబైలోని ఈద్-ఎ-మిలాద్ ఊరేగింపు తుర్భే నుండి ప్రారంభమై వాషి, కోపర్‌ఖైరానే మీదుగా ఘన్సోలీ దర్గా వద్ద ముగుస్తుంది.
మనం ఈద్-ఎ-మిలాద్ ఎందుకు జరుపుకుంటాము?
ప్రవక్త ముహమ్మద్ జన్మదినం సందర్భంగా ఈద్-ఎ-మిలాద్ జరుపుకుంటారు. ఈ సందర్భంగా ముస్లింలు ప్రపంచ వ్యాప్తంగా ఊరేగింపులు చేపడుతుంటారు. ఈ రోజు ఇస్లామిక్ క్యాలెండర్‌లో మూడవ నెల అయిన రబీ అల్-అవ్వల్‌లో వస్తుంది. సున్నీ ఇస్లామిక్ పండితుల ప్రకారం, ప్రవక్త ముహమ్మద్ దాదాపు క్రీ.శ. 570లో రబీ అల్ అవ్వల్ నెల 12వ తేదీన మక్కాలో జన్మించారు. అయితే చాలా మంది షియా పండితుల ప్రకారం, అతను ఈ నెల 17వ తేదీన జన్మించాడని చెబుతుంటారు. క్రీ.శ. 570లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జననం, క్రీ.శ. 632లో ఆయన మరణం రెండూ ఒకే రోజున జరిగినందున ఈద్-ఎ-మిలాద్ వేడుకలు ఒక వేడుక, సంతాపంగా మరోవేడుకగా చెబుతుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి