పబ్‌జీ గేమ్‌ను మళ్లీ ఆడాలనుకుంటున్నారా.? అయితే కొంచెం రిస్క్ చేయాల్సిందే.. జర భద్రం.!

PUBG Mobile India: మీకు పబ్‌జీ అంటే ఇష్టామా.? ఆ గేమ్‌ను మళ్లీ ఆడాలనుకుంటున్నారా.? అయితే కొంచెం రిస్క్ చేయాల్సిందే.! పబ్‌జీ ప్లేయర్స్‌కు..

పబ్‌జీ గేమ్‌ను మళ్లీ ఆడాలనుకుంటున్నారా.? అయితే కొంచెం రిస్క్ చేయాల్సిందే.. జర భద్రం.!
Follow us

|

Updated on: Feb 02, 2021 | 9:39 PM

PUBG Mobile India: మీకు పబ్‌జీ అంటే ఇష్టామా.? ఆ గేమ్‌ను మళ్లీ ఆడాలనుకుంటున్నారా.? అయితే కొంచెం రిస్క్ చేయాల్సిందే.! పబ్‌జీ ప్లేయర్స్‌కు జాతీయ మీడియా ఇన్‌సైడ్ స్పోర్ట్ ఓ ఇంటరెస్టింగ్ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు చూద్దాం.. ఇండియాలో పబ్‌జీను ఆడేందుకు ఓ లింక్ ఉన్నట్లు ఇన్‌సైడ్ స్పోర్ట్ అనే జాతీయ సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది.

(https://web.gpubgm.com/m/Website/xiaobao/PUBGMOBILE_Global_1.2.0_uawebsite.apk) ఈ లింక్ ద్వారా గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అందులో పేర్కొంది. ఫైల్ సైజ్ 613 ఎంబీ ఉంటుందని.. VPN ద్వారా, ఈ లింక్ PUBG మొబైల్ క్లాసిక్, TDM వెర్షన్లను ఆడేందుకు అనుమతిస్తుందని తెలిపింది.

PUBG మొబైల్‌ను ఆడేందుకు మరో మార్గం కూడా ఉంది. అదేంటంటే.. VPN ద్వారా PUBG అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి, మీ లొకేషన్‌ను మార్చుకుని.. 624 ఎంబీతో కూడిన గేమ్ APK లింక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఇక జనవరి 26న FAU-G గేమ్ లాంఛ్ కావడంతో.. ఇండియాలో PUBG రీ-ఎంట్రీ కష్టమని చెప్పాలి. కాగా, పబ్‌జీ గేమ్ భారత్‌లో బ్యాన్ కావడం వల్ల ఈ లింకుల నుంచి ఎవరైనా గేమ్ ఆడితే కఠిన శిక్షలు తప్పవు. ఇదే అంశాన్ని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారి చేసిన సంగతి కూడా తెలిసిందే. అలాగే ఇలాంటి లింకుల్లో పలు ఫేక్‌వి కూడా ఉంటాయి గనుక చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: ప్రభాస్ ‘ఆదిపురుష్’ సెట్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. చిత్ర యూనిట్ తప్పిన పెను ముప్పు..