Tamil Nadu: చిన్నమ్మకు మద్దతుగా పోస్టర్లు.. తమిళనాడులో హీటెక్కిన రాజకీయాలు.. అధికార వర్గం సీరియస్
జైలు నుంచి చిన్నమ్మ శశికళ విడుదలైన మరుసటి రోజే తమిళనాడులో రాజకీయాలు హీటెక్కాయి. రానున్న ఎన్నికల్లో పావులు కదిపేందుకు శశికళ వర్గం..
Tamil Nadu politics: జైలు నుంచి చిన్నమ్మ శశికళ విడుదలైన మరుసటి రోజే తమిళనాడులో రాజకీయాలు హీటెక్కాయి. రానున్న ఎన్నికల్లో పావులు కదిపేందుకు శశికళ వర్గం దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శశికళ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రణాళికలు రచిస్తున్నారు. శశికళ జైలు నుంచి విడుదలైన అనంతరం మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా శశికళకు మద్దతుగా పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. అన్నాడీఎంకే పార్టీకి శశికళ సారధ్యం వహించాలని, రానున్న ఎన్నికలలో గెలుపుకోసం శశికళకి అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు అండగా ఉండాలంటూ చాలాచోట్ల పోస్టర్లు తెరపైకి వచ్చాయి.
అయితే ఈ పోస్టర్ల వివాదాన్ని సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సీరియస్‌గా తీసుకున్నారు. అనంతరం తూత్తుకుడి, విల్లుపురం, తేని , తిరునల్వేలి , మధురై సహా పలు జిల్లాల్లో శశికళకి మద్ధతు తెలుపుతున్న వారిని పార్టీ నుండి సస్పండ్ చేస్తూ ఉత్తర్వులు సైతం విడుదల చేశారు. దీంతో తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. శశికళకు మద్దతుగా పోస్టర్లు, బ్యానర్లు వెలువడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Also Read:
ఢిల్లీ పోలీసులకు మెటల్ రాడ్స్ ! అంతా వట్టిదే ! అలాంటి ప్రతిపాదన లేదన్న అధికారులు