Rashtrapati Bhavan : సందర్శకుల కోసం తెరుచుకోనున్న రాష్ట్రపతి భవన్ ద్వారాలు.. కానీ ఇవి పాటించండి..
దాదాపు పది నెలల తర్వాత రాష్ట్రపతి భవన్ సందర్శకుల కోసం తెరుచుకోనుంది. సందర్శనకు తిరిగి అనుమతిస్తున్నట్లుగా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందని..
Rashtrapati Bhavan : దాదాపు పది నెలల తర్వాత రాష్ట్రపతి భవన్ సందర్శకుల కోసం తెరుచుకోనుంది. సందర్శనకు తిరిగి అనుమతిస్తున్నట్లుగా అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6 నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుందని వెల్లడించారు. కోవిడ్ ప్రభావంతో గత ఏడాది మార్చి 13 నుంచి సందర్శకులను నిలిపివేసింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో కరోనా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత సందర్శకులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు.
సందర్శకులు ఇవి పక్కాగా పటించాలి..
కరోనా కట్టడికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడంతోపాటు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి శనివారం, ఆదివారం సందర్శకులకు అవకాశం ఉంటుంది. గతంలో విధంగానే.. రాష్ట్రపతి భవన్ వెబ్సైట్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.