farmers protest in haryana సీఎం ఖట్టర్ డౌన్, డౌన్, హర్యానాలో రైతులపై పోలీసుల లాఠీఛార్జ్, బాష్పవాయు ప్రయోగం, పలువురికి గాయాలు
హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాకకు నిరసనగా ప్రదర్శనకు దిగిన వందలాది రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో అనేకమంది అన్నదాతలు గాయపడ్డారు....

హర్యానాలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రాకకు నిరసనగా ప్రదర్శనకు దిగిన వందలాది రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బాష్పవాయువు ప్రయోగించారు. ఈ ఘటనలో అనేకమంది అన్నదాతలు గాయపడ్డారు. బ్యారికేడ్లను ఛేదించుకుని వస్తున్న పలువుర్ని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాలోని హిసార్ జిల్లాలో కోవిడ్ ఆసుపత్రిని ప్రారంభించడానికి వచ్చిన సీఎం ఖట్టర్ కు వారి నుంచి ఇలా వ్యతిరేకత ఎదురైంది. రాష్ట్రంలో లాక్ డౌన్ ను మరో వారం పాటు పొడిగించిన రోజే ఈ ఘటన జరిగింది. పోలీసుల చర్యను ఖండిస్తూ తొమ్మిదో జాతీయ రహదారిపై రైతులు రెండు గంటలపాటు బైఠాయించారు. హిసార్ ఘటన గురించి తెలుసుకున్న భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ చారుని…అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు స్టేషన్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. హిసార్ లో కోవిడ్ ఆసుపత్రి ప్రారంభ కార్యక్రమానికి సుమారు 500 మంది హాజరయినట్టు వీడియో ద్వారా తెలుస్తోందని, ఈ కోవిద్ సమయంలో ఇంత హడావుడిగా దీన్ని నిర్వహించే బదులు సీఎం దీన్ని ఆన్ లైన్ ద్వారా ప్రారంభించవచ్చునని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కోవిద్ వ్యాప్తికి ఇలాంటి వారే కారకులవుతున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి పర్సనల్ గా వెళ్లాలా అని ఆయన ప్రశ్నించారు.
హర్యానాలో రెండు వారాలుగా లాక్ డౌన్ అమల్లో ఉంది.తప్పనిసరి పరిస్థితుల్లో మరోవారం పాటు దీన్ని పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో నిన్న 9,676 కోవిద్ కేసులు నమోదయ్యాయి. 144 మంది రోగులు మృతి చెందారు.
మరిన్ని చదవండి ఇక్కడ : కరోనాతో తండ్రి మృతి.. చితిలో దూకిన కుమార్తె వైరల్ అవుతున్న వీడియో ..: viral video.
Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).



