Remdesivir : ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా రెమ్ డెసివిర్ మెడిసిన్ విక్రయాలు, తమిళనాడు ప్రభుత్వ నిర్ణయం
కోవిడ్ రోగుల చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ మందును నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెడిసిన్ కోసం డిస్పెన్సరీల వద్ద వందలాది ప్రజలు క్యూలు కట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు....
కోవిడ్ రోగుల చికిత్సలో వాడే రెమ్ డెసివిర్ మందును నేరుగా ప్రైవేటు ఆసుపత్రులకు అమ్మాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మెడిసిన్ కోసం డిస్పెన్సరీల వద్ద వందలాది ప్రజలు క్యూలు కట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజురోజుకూ గుంపులు పెరుగుతున్న దృష్ట్యా బ్లాక్ మార్కెట్ లో దీని అమ్మకాలకు చెక్ పెట్టేందుకు మొదట 7 జిల్లాల్లో ప్రైవేటు హాస్పిటల్స్ కు దీన్ని అమ్మనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. చెన్నైలో మొదట కీల్పాక్ మెడికల్ కళాశాల ఆసుపత్రిలో ఇటీవల ఈ మెడిసిన్ అమ్మకాలు చేపట్టినప్పటికీ ప్రజల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో దీని విక్రయాలను విశాలమైన నెహ్రూ స్టేడియానికి మార్చారు. కానీ జనాల రద్దీ మాత్రం తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. ఈ దృష్ట్యా కోవిడ్ రోగుల బంధువులకు బదులు ఇక ప్రైవేటు హాస్పిటల్స్ కి అమ్మాలని సీఎం స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18 నుంచి వెబ్ పోర్టల్ ను కూడా ప్రారంభించనున్నారు. దీనివల్ల ఈ ఆసుపత్రుల సిబ్బంది రోగుల వివరాలను నమోదు చేసుకోగలుతారు. ఈ మెడిసిన్ కేటాయింపులు అందగానే రోగుల బంధువులు సంబంధిత సెంటర్ కి వెళ్లి దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ప్రజారోగ్య శాఖ అధికారులు సదా దీని విక్రయాలను పర్యవేక్షిస్తుంటారు.దీన్ని అడ్డదారిన పొందినా, బ్లాక్ మార్కెట్ లో అమ్మజూచినా కఠిన చర్యలు తీసుకుంటారు.చెన్నైలో నెహ్రూ స్టేడియం వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు రెమ్ డెసివిర్ మందు కోసం గంటలు, గంటలు బారులు తీరి నిలబడడాన్ని ప్రభుత్వం గమనించింది.
మరిన్ని చదవండి ఇక్కడ : కరోనాతో తండ్రి మృతి.. చితిలో దూకిన కుమార్తె వైరల్ అవుతున్న వీడియో ..: viral video.
Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).