Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఊహించ‌ని విషాదం.. పెళ్లైన ఐదు రోజులకే కరోనాతో వ‌రుడు మృతి !

దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ అంతా, ఇంతా కాదు. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ ఎన్నో విషాదాలు రోజూ చూడాల్సి వస్తుంది. తాజాగా ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో పెళ్లి అయిన..

Coronavirus:  ఊహించ‌ని విషాదం.. పెళ్లైన ఐదు రోజులకే కరోనాతో వ‌రుడు మృతి !
Corona Death
Follow us
Ram Naramaneni

|

Updated on: May 16, 2021 | 7:41 PM

దేశ‌వ్యాప్తంగా క‌రోనా సెకండ్ వేవ్ చేస్తోన్న డ్యామేజ్ అంతా, ఇంతా కాదు. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల‌ ఎన్నో విషాదాలు రోజూ చూడాల్సి వస్తుంది. తాజాగా ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో పెళ్లి అయిన ఐదు రోజులకే నూతన వరుడు వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు విడిచాడు. రాజ్ కానిక మండలం, దుర్గదేబిపాడా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ నాయక్.. బెంగళూరులో ఓ ప్రైవేటు కంపెనీలో కొలువు చేస్తున్నాడు. మే 1న సొంతూరికి వచ్చాడు. వచ్చే ముందే బెంగళూరులో కరోనా టెస్టులు చేయించుకున్నాడు. కానీ నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. ఈ క్ర‌మంలో మే 9న అతని పెళ్లి జరిగింది.

ఇంటికి వచ్చిన కొద్ది రోజులకే అతని ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. వివాహం అనంతరం కరోనా సింట‌మ్స్ బయటపడ్డాయి. కానీ పెళ్లి స‌మ‌యంలో అధికంగా స్నానం చేయటం వల్ల జ‌లుబు, జ్వరం ల‌క్ష‌ణాలు వ‌చ్చి ఉండొచ్చని కుటుంబ సభ్యులు భావించారు. జ్వరం మాత్రలు వేసుకున్నా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆరోగ్యం బాగాలేకున్నా ముహూర్తం వ‌ల్ల‌ మే 12న శోభనం నిర్వహించాల్సి వచ్చిందని తెలిపారు. అనంతరం అతని ఆరోగ్యం మరింత క్షీణించగా.. జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు వెల్ల‌డించారు. అతని ఆరోగ్యం మరింత విషమించడం వల్ల భువనేశ్వర్ లోని ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్ట‌ర్ల‌ సూచించారు. అక్కడికి తీసుకెళ్తుండగా.. మార్గ మధ్యలోనే సంజయ్ చ‌నిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read: కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు.. జ‌గ‌న్ సర్కారు ఉత్తర్వులు

తెలంగాణలో కొత్తగా 3,816 కేసులు.. మ‌ర‌ణాలు, యాక్టివ్ కేసుల వివ‌రాలు ఇవి

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!