Telangana Corona Cases: తెలంగాణలో కొత్తగా 3,816 కేసులు.. మ‌ర‌ణాలు, యాక్టివ్ కేసుల వివ‌రాలు ఇవి

తెలంగాణలో క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లే అనిపిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 3,816 కరోనా కేసులు వెలుగుచూశాయి.

Telangana Corona Cases: తెలంగాణలో  కొత్తగా 3,816 కేసులు.. మ‌ర‌ణాలు, యాక్టివ్ కేసుల వివ‌రాలు ఇవి
Telangana Corona
Follow us
Ram Naramaneni

|

Updated on: May 16, 2021 | 7:26 PM

తెలంగాణలో క‌రోనా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన‌ట్లే అనిపిస్తుంది. రాష్ట్రంలో కొత్తగా 44,985 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 3,816 కరోనా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 5,28,823కు చేరింది. వైర‌స్ కార‌ణంగా మరో 27మంది ప్రాణాలు విడిచారు. ఫ‌లితంగా మొత్తం మ‌ర‌ణాల సంఖ్య‌ 2,955 కు చేరింది. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 658 కరోనా కేసులు వెలుగుచూడ‌గా.. మేడ్చల్‌ మల్కాజిగిరిలో 239, రంగారెడ్డిలో 326, ఖమ్మంలో 151 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. తాజాగా కరోనా నుంచి 5,892 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య‌ 4,74,899కు చేరుకుంది. రాష్ట్రంలో 50,969 యాక్టివ్ కేసులున్నాయి.

ఫీవర్‌ సర్వే: గ్రేటర్‌ పరిధిలో 50 వేల మందికి పైగా కొవిడ్‌ లక్షణాలు

కరోనా సెకండ్ వేవ్ టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోన్న నేపథ్యంలో ఫివ‌ర్ బాధితులను గుర్తించేందుకు తెలంగాణ స‌ర్కార్ ఫీవర్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వైద్య, జీహెచ్ఎంసీ టీమ్స్ జంట నగరాల్లో ఇంటింటికీ తిరుగుతూ జ్వరం సహా ఇతర వ్యాధి సింటమ్స్ వారిని గుర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే గత 15 రోజుల్లో గ్రేటర్ పరిధిలో 50 వేల మందికి పైగా క‌రోనా లక్షణాలతో బాధపడుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రభుత్వం నిర్వహిస్తోన్న సెంట‌ర్లు సహా ప్రైవేటులో నమోదవుతున్న నిర్ధారణ పరీక్షల సమాచారాన్ని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక బులెటిన్‌ రూపంలో రోజూ విడుద‌ల చేస్తోంది. అందులో వెల్లడైన పాజిటివ్‌ కేసుల సమాచారానికి అదనంగా ఈ 50 వేల మంది బాధితులు నమోదవడం ఆందోళన కలిగించే అంశమేనని నిపుణులు పేర్కొంటున్నారు.

Also Read: కొవిడ్ మృతుల అంత్యక్రియలకు రూ.15 వేలు.. జ‌గ‌న్ సర్కారు ఉత్తర్వులు

 ఏపీలో ప్ర‌మాద‌క‌రంగా క‌రోనా వ్యాప్తి.. కొత్త‌గా 24,171 కేసులు.. ప్ర‌మాద‌క‌రంగా మ‌ర‌ణాలు

అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
అందుకే చలికాలంలో క్యాబేజీ తప్పకుండా తినాలట..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
వినతులు వినే గణపతి.. దర్శనంతోనే కోరిన కోర్కెలు తీర్చే దైవం..
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
పివి నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోసిన మన్మోహన్
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
హెల్మెట్స్ లేకుండా చిక్కితే మీకు వాయింపు మాములుగా ఉండదు
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
ప్లాన్ చేసే ఆ హీరోయిన్‌కు ముద్దిచ్చా.. షాకిచ్చిన స్టార్ హీరో
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా?
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
నార్త్‌ మీద జాన్వీ ఫోకస్‌ తగ్గించారా ??
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
ఆవ పెట్టిన పనస పొట్టు కూర.. అమ్మమ్మ స్టైల్ లో తయారు చేసుకోండి ఇలా
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
బన్నీని సపోర్ట్‌ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన హీరోయిన్
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు
పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. గుండెపోటు తప్పదు