AP Corona Cases: ఏపీలో ప్రమాదకరంగా కరోనా వ్యాప్తి.. కొత్తగా 24,171 కేసులు.. ప్రమాదకరంగా మరణాలు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా రాష్ట్రంలో 94,550 శాంపిల్స్ టెస్ట్ చేయగా.......
ఆంధ్రప్రదేశ్ లో కరోనా తీవ్రత కొనసాగుతోంది. రోజు రోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా రాష్ట్రంలో 94,550 శాంపిల్స్ టెస్ట్ చేయగా… 24,171 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. తాజాగా 101 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. ఫలితంగా ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 9,372కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 2,10,436 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.
అనంతపురం జిల్లాలో 14 మంది, విశాఖలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణ, విజయనగరం జిల్లాల్లో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఆరుగురు, పశ్చిమగోదావరిలో ముగ్గురు ,కడప జిల్లాలో ఇద్దరు చొప్పున మహమ్మారి బారినపడి కన్నుమూశారు. కొత్తగా 21,101 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,79,75,305 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.
#COVIDUpdates: 16/05/2021, 10:00 AM రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,32,596 పాజిటివ్ కేసు లకు గాను *12,12,788 మంది డిశ్చార్జ్ కాగా *9,372 మంది మరణించారు * ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,10,436#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/AZg4SVrvqj
— ArogyaAndhra (@ArogyaAndhra) May 16, 2021