‘నేనింకా చిన్న పిల్లను, డాక్టర్ని అయి పేదలకు సేవ చేయాలనుకున్నా’, యుద్ధ భూమిలా మారిన గాజా సిటీలో విలపించిన పదేళ్ల చిన్నారి
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం అమాయక ప్రజల ఉసురు తీస్తోంది. కల్లాకపటం తెలియని పిల్లలు తమ కళ్ళ ముందు జరుగుతున్న వినాశనాన్ని చూసి కంట తడిపెడుతున్నారు. అసలు ఏం జరుగుతోందో తెలియక...
ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం అమాయక ప్రజల ఉసురు తీస్తోంది. కల్లాకపటం తెలియని పిల్లలు తమ కళ్ళ ముందు జరుగుతున్న వినాశనాన్ని చూసి కంట తడిపెడుతున్నారు. అసలు ఏం జరుగుతోందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. నదినె అబ్దేల్ తైఫ్ అనే బాలిక తన ఇంటి ముందు కనిపిస్తున్న శిథిలాలను చూస్తూ కన్నీరు పెడుతున్న వీడియో అక్కడి దారుణానికి నిదర్శనంగా కనిపిస్తోంది. తనకు పదేళ్ళని, తాను డాక్టర్ని అయి తనవాళ్లకు, పేదలకు సేవలు చేయాలనుకున్నానని, కానీ తన ఆశలన్నీ ఆవిరయ్యాయని ఆమె విలపిస్తూ చెప్పింది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానని, ఈ దారుణ పరిస్థితిని భరించలేకపోతున్నానని ఆమె చెప్పింది. మేము ముస్లిములమైనంత మాత్రాన వాళ్లకు ….ఇజ్రాయెల్ కు శత్రువులమయ్యామా అని ఆమె ప్రశ్నించింది. ఆల్ జజీరాకు చెందిన ఓ ప్రొడ్యూసర్ ఈ వీడియోను తన ట్విటర్ లో షేర్ చేయగానే ఒక రోజులో 5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
మరిన్ని చదవండి ఇక్కడ : Ward boy rapes Covid patient video: హాస్పిటల్ లో కరోనా పేషేంట్ పై వార్డ్ బాయ్ లైంగిక దాడి వైరల్ వీడియో..
Raghu Rama Krishna Raju : రఘురామకృష్ణంరాజుకు హై కోర్ట్ షాక్ బెయిల్ నిరాకరణ..!(వీడియో).