NEPAL CRISIS: పొరుగు దేశంలో పెను సంక్షోభం.. ఓవైపు కరోనా.. ఇంకోవైపు పాలిటిక్స్.. నేపాల్ ఉక్కిరిబిక్కిరి

ఉప్పుకు.. పప్పుకు మన దేశం మీద ఆధారపడే నేపాల్.. మన దేశంలో కరోనా సెకెండ్ వేవ్ రాగానే సరిహద్దులు మూసేసి మరి కాస్త ఫోజ్ కొట్టింది. పోనీ అంతే నిక్కచ్చిగా తమ దేశాన్ని నేపాలీయులు చక్కబెట్టుకున్నారా అంటే అదీ లేదు.. ఓ వైపు...

NEPAL CRISIS: పొరుగు దేశంలో పెను సంక్షోభం.. ఓవైపు కరోనా.. ఇంకోవైపు పాలిటిక్స్.. నేపాల్ ఉక్కిరిబిక్కిరి
Nepal Political Crisis
Follow us

|

Updated on: May 16, 2021 | 4:04 PM

NEPAL CRISIS SEVERE SINCE FEW DAYS: ఉప్పుకు.. పప్పుకు మన దేశం మీద ఆధారపడే నేపాల్.. మన దేశంలో కరోనా సెకెండ్ వేవ్ రాగానే సరిహద్దులు మూసేసి మరి కాస్త ఫోజ్ కొట్టింది. పోనీ అంతే నిక్కచ్చిగా తమ దేశాన్ని నేపాలీయులు చక్కబెట్టుకున్నారా అంటే అదీ లేదు.. ఓ వైపు రాజకీయ సంక్షోభం.. మరోవైపు కరోనా సెకెండ్ వేవ్.. వెరసి నేపాల్ ప్రస్తుతం అతలాకుతలం అవుతోంది. నాలుగైదు రోజుల క్రితం పార్లమెంటులో పెట్టిన విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన ప్రధాని శర్మను బతిమాలి మరీ తిరిగి అదే సీటులో కూర్చోబెట్టిన దౌర్భగ్యపు ప్రజాస్వామ్యం నేపాల్‌లో రాజ్యమేలుతోంది. ఒకపక్క రాజకీయ అస్థిరతలో, మరోపక్క రోజురోజుకూ పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపాల్‌ ఇప్పట్లో కుదుటపడే జాడలు కనబడటం లేదు. గత డిసెంబర్‌లో పార్లమెంటు దిగువసభను రద్దు చేస్తూ శర్మ నిర్ణయం తీసుకున్నప్పట్నించి నేపాల్‌ సంక్షోభంలో పడిపోయింది. వాస్తవానికి అప్పటికి ప్రతినిధుల సభ ఎన్నికలకు ఇంకా సంవత్సరం గడువుంది. 275 మంది సభ్యులుండే సభలో అధికార పక్షమైన నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్‌)కి 174 మంది సభ్యుల మద్దతుంది. అయితే పార్టీలో మరో బలమైన వర్గానికి నాయకుడిగా వున్న మాజీ ప్రధాని ప్రచండతో లోగడ కుదిరిన అవగాహనకు భిన్నంగా శర్మ సమస్త అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడంతో అతనికి ప్రచండకు మధ్య సంబంధాలు చెడిపోయాయి. తనను పదవినుంచి దించేందుకు ప్రచండ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి ప్రతినిధుల సభను శర్మ అనూహ్యంగా రద్దు చేశారు. దాంతో నేపాల్ రాజకీయ సంక్షోభంలో పడిపోయింది.

నేపాల్‌లో కరోనా వైరస్‌ సెకెండ్ వేవ్ చాలా తీవ్రంగా వుంది. మనదేశంలో సెకెండ్ వేవ్ ప్రారంభం కాగానే భారత్ నుంచి వచ్చే అన్ని మార్గాలను మూసివేస్తున్నట్లు అతి జాగ్రత్త చర్యల్లో భాగంగా నేపాల్ ప్రకటించింది. అయితేనేం.. నేపాల్‌ను కరోనా సెకెండ్ వేవ్ వదిలి పెట్టలేదు. అన్ని జిల్లాల్లో గత రెండు వారాలుగా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. కరోనా ఉధృతితో మన దేశంలో మళ్లీ ఆంక్షలు విధించడంతో నేపాల్‌ నుంచి వలస వచ్చని కూలీలు పెద్ద సంఖ్యలో తమ దేశానికి తిరిగి వెళ్ళారు. ఈ వలస కూలీలు తమ దేశానికి తమ బాధలతో పాటు.. కరోనా వైరస్‌ను తీసుకెళ్ళారు. వలస జీవులు తమ దేశానికి చేరుకున్న తర్వాతే నేపాల్ కరోనా మరింత ఉగ్రరూపం దాల్చింది. ఏప్రిల్‌ నెలంతా ఆ దేశంలో వంద కేసులుండగా, ప్రస్తుతం రోజుకు 9 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నేపాల్‌లో నమోదవుతున్నాయి. వైద్య సదుపాయాలు లేవంటూ రోగులను ఆసుపత్రులు వెనక్కిపంపడం అక్కడ సర్వసాధారణమైపోయింది. సాధారణ ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు మొదలుకొని ఆక్సిజన్, వెంటిలేటర్‌ వరకూ అన్నిటికీ కొరత వున్నదని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. పర్యవసానంగా ప్రాణాలు కోల్పోతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది.

నేపాల్‌లో కరోనా పరీక్షలుగానీ, క్వారంటైన్‌ కేంద్రాల నిర్వహణ గానీ లేదు. నిరుడు కరోనా విజృంభించినప్పుడు సైన్యం సాయం తీసుకున్న ప్రభుత్వం ఈసారి మాత్రం తగిన విధంగా స్పందించలేదు.. సరైన చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా వైద్య రంగంపై కేంద్రీకరించాల్సిన ఈ తరుణంలో నేపాల్‌ రాజకీయ నాయకులు అధికారం కోసం వికృత క్రీడను ఆరంభించారు. 2020 డిసెంబర్‌లో పార్లమెంటు రద్దు చేసినప్పుడే శర్మ ఓలిని అందరూ దుయ్యబట్టారు. అప్పటికి కరోనా తీవ్రత తగ్గి కాస్త కుదుటపడుతున్నట్టు కనబడినా, నిర్లిప్తత పనికిరాదని హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల్లో ఆ మహమ్మారి విజృంభిస్తున్న తీరును ఎత్తిచూపారు. ఈ సలహాలను, సూచనలను నేపాల్ పాలక, ప్రతిపక్షాలు పెడచెవిన పెట్టాయి. దాంతో ప్రస్తుతం పరిస్థితి విషమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

శర్మ ఓలిని తప్పిస్తే అన్నీ సర్దు కుంటాయని విపక్షాలూ… వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం దక్కనివ్వరాదని ఆయన పట్టుదల ప్రదర్శించారు. ఈలోగా పార్లమెంటు రద్దు నిర్ణయం నిబంధనలకు విరుద్ధంగా వున్నదని ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రతినిధుల సభను పునరుద్ధరించింది. మధ్యంతర ఎన్ని కల్లో విజయం సాధించి, ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించవచ్చని కలలుగన్న శర్మ ఓలి సుప్రీంకోర్టు తీర్పుతో ఖంగు తిన్నారు. అసలు సీపీఎన్‌(యూఎంఎల్‌), సీపీఎన్‌(మావోయిస్టు సెంటర్‌)లు విలీనమై ఆవిర్భవించిన సీపీఎన్‌ కూడా చెల్లుబాటు కాదని మరో తీర్పులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఉమ్మడిగా వున్నప్పుడే అంతర్గత కలహాలతో సతమతమైన పార్టీ రెండుగా విడిపోయాక మాత్రం సమష్టిగా ఏం పనిచేస్తుంది? పర్యవసానంగా శర్మ ఓలి సర్కారు ఓడిపోయింది. మూడు రోజుల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ దేశ అధ్యక్షురాలు విద్యాదేవి భండారీ విపక్షాలను కోరినా ఆ అవకాశాన్ని ప్రతిపక్షాలు సరిగ్గా వినియోగించుకోలేకపోయాయి. పర్యవసానంగానే మళ్లీ శర్మ ఓలియే ప్రధాని పదవిని అధిష్టించారు. కానీ నెలరోజుల్లో ఆయన తన బలనిరూపణ చేసుకోవాలన్న షరతు వుండడంతో ఆయన ఎంతో కాలం పదవిలో కొనసాగే పరిస్థితి కనిపించడం లేదు. దాంతో నేపాల్‌లో అతి త్వరలోనే ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.

మన దేశంలో కరోనా సెకెండ్ వేవ్ ప్రారంభం కాగానే.. భారత్‌కు దూరం, చైనాకు దగ్గర అన్న సంకేతాలిచ్చిన నేపాల్ పట్ల మన దేశంలో సానుకూలంగానే వ్యవహరించింది. ఇప్పటి దాకా నేపాల్ 20 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులను మన దేశం నేపాల్‌కు సరఫరా చేసింది. మన దేశం పంపిణీ చేసిన 20 లక్షల వ్యాక్సిన్లు మినహా ఇతరత్రా టీకాల లభ్యత నేపాల్‌లో లేదు. స్థానికంగా వుండే ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చడానికి కావాలనే ప్రభుత్వం టీకాల కొరత సృష్టించిందని విమర్శలు రావడం నేపాల్‌లో నెలకొన్న అమానవీయ పరిస్థితికి అద్దం పడుతుంది. దక్షిణాసియాలో వేరే దేశాలతో పోలిస్తే దారుణమైన పేదరికంలో మగ్గుతున్న నేపాల్‌ ఇంతటి మహావిపత్తులో చిక్కుకోగా ఒక్కటంటే ఒక్క పార్టీ కూడా అందుకు తగినట్టు స్పందించాలన్న ఇంగిత జ్ఞానాన్ని ప్రదర్శించలేకపోయాయి. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఎలాంటి చర్యలు అవసర మన్న అంశాన్ని గాలికొదిలి రాజకీయ ఎత్తుగడల్లోనే అవి పొద్దుపుచ్చాయి.

ఇప్పుడు మళ్లీ ప్రభు త్వాన్ని ఏర్పాటు చేసిన శర్మ ఓలి ఏదో ఒరగబెడతారన్న భ్రమలు ఎవరికీ లేవు. కరోనా రానీయ కుండా కట్టడి చేయడానికి ప్రతి ఇంటి గుమ్మానికి జామ ఆకులు కట్టమని రెండు నెలల క్రితం పిలుపు నిచ్చి ఆయన నవ్వులపాలయ్యాడు. కాస్త హెచ్చుతగ్గులుండొచ్చుగానీ… వర్ధమాన దేశాల్లో చాలా చోట్ల నేపాల్‌ మాదిరే ప్రజాస్వామ్య వ్యవస్థలు నిరర్థక వేదికలుగా మారాయి. జవాబుదారీతనానికి తిలోదకాలిస్తున్నాయి. అంతా సజావుగా సాగినప్పుడు తమ ఘనతేనని చెప్పుకునే అధినేతలు, సంక్షోభం చుట్టుముట్టాక ప్రజలపైనో, ప్రకృతిపైనో నెపం వేసి చేతులు దులుపుకుంటున్నారు. దీన్నుంచి సాధ్యమైనంత త్వరగా నేపాల్‌ ప్రజలు బయటపడాలని ఆకాంక్షించడం మినహా ఎవరూ చేయగలిగింది లేదు.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!