PM Modi: గురు, శుక్రవారాల్లో ప్రధాని మోడీ గుజరాత్ టూర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం కావడంతో అక్కడి ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోసారి గెలిచి పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీ ఓ వైపు..

PM Modi: గురు, శుక్రవారాల్లో ప్రధాని మోడీ గుజరాత్ టూర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
Pm Modi
Follow us

|

Updated on: Sep 29, 2022 | 8:24 AM

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రం కావడంతో అక్కడి ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోసారి గెలిచి పీఠాన్ని కైవసం చేసుకోవాలనుకుంటున్న బీజేపీ ఓ వైపు.. విపక్షాలు, ప్రతిపక్షాలు మరోవైపు.. ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెప్టెంబర్ 29, 30 తేదీల్లో గుజరాత్ లో పర్యటించనున్నారు. అనేక కార్యక్రమాలకు హాజరై.. అభివృద్ధి కార్యక్రమాలనూ ప్రారంభిస్తారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్ మెట్రోలో పీఎం మోడీ ప్రయాణం చేయనున్నారు. సూరత్, భావ్‌నగర్, అహ్మదాబాద్, అంబాజీలలో విస్తరించి ఉన్న కార్యక్రమాలలో దాదాపు ₹ 29,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాన మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టులు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, జీవన సౌలభ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడం లక్ష్యంగా ఉన్నాయని పీఎంఓ ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటితో పాటు భావ్‌నగర్‌లో ప్రపంచంలోనే తొలి సీఎన్జీ టెర్మినల్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

గుజరాత్ లోని భావ్ నగర్ నగరం అద్భుతమైన చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోంది. భవానీనగర్‌లో జరిగిన కార్యక్రమంలో రూ. 5200 కోట్లను జాతికి అంకితం చేయనున్నారు. సూరత్‌లో డైమండ్ ట్రేడింగ్ వ్యాపార వేగవంతమైన వృద్ధిని పూర్తి చేయడానికి ఉద్దేశించిన డ్రీమ్ సిటీ – ప్రాజెక్ట్ మొదటి దశనూ ప్రధాని ప్రారంభిస్తారు. అర్బన్ రీజెనరేషన్, బయోడైవర్సిటీ పార్క్, సైన్స్ సెంటర్ , డ్రీమ్ సిటీ ఫేజ్-2కు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పనులు సూరత్ ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాన్ని అందిస్తాయని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

తన రెండు రోజుల్లో ముందుగా అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభిస్తారు. అనంతరం గాంధీనగర్-ముంబై సెంట్రల్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. కాగా.. గుజరాత్‌లో తొలిసారిగా జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నారు. 36 వ జాతీయ క్రీడలనూ ప్రధాని మోడీ ప్రారంభిస్తారు. సెప్టెంబర్ 29 నుంచి ఆగస్టు 12 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. అహ్మదాబాద్‌లోని 6 ప్రదేశాల్లో 16 గేమ్‌లు జరగనున్నాయి. ఇందులో 7,100 మంది క్రీడాకారులు పాల్గొంటారు. సూరత్‌లోనూ రెండు చోట్ల 4 గేమ్‌లు జరగుతున్నాయి. అంబాజీ ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కొత్త బ్రాడ్ గేజ్ లైన్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. దీని ద్వారా అంబాజీకి యాత్రికులు సులభంగా ప్రయాణించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు