AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat: శ్రీకృష్ణుని బోధనలను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. టోక్యో ఒలింపిక్స్‌ విజేతలపై ప్రశంసలు

టోక్యో ఒలింపిక్స్‌ విజేతలపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. 80వ మన్‌కీ బాత్‌లో ప్రసంగించిన పీఎం..టోక్యో వేదికగా పతకాలు గెలవడంతో యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేసిందన్నారు. ఇవాళ జరిగిన పారా ఒలింపిక్స్‌లో...

Mann Ki Baat: శ్రీకృష్ణుని బోధనలను గుర్తుచేసుకున్న ప్రధాని మోడీ.. టోక్యో ఒలింపిక్స్‌ విజేతలపై ప్రశంసలు
Mann Ki Baat
Sanjay Kasula
|

Updated on: Aug 29, 2021 | 2:56 PM

Share

టోక్యో ఒలింపిక్స్‌ విజేతలపై ప్రశంసలు కురిపించారు ప్రధాని మోడీ. 80వ మన్‌కీ బాత్‌లో ప్రసంగించిన పీఎం..టోక్యో వేదికగా పతకాలు గెలవడంతో యావత్‌ దేశం హర్షం వ్యక్తం చేసిందన్నారు. ఇవాళ జరిగిన పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు సిల్వర్‌ మెడల్‌ రావడం ఆనందంగా ఉందని.. దేశంలోని యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు.

రేపు కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణుని బోధలను గుర్తుచేశారు ప్రధాని. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతున్నాయన్నారు. దేశంలో స్వచ్ఛ భారత్‌ ఊపందుకుందని..దీన్ని మరింత పెంచే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. క్లీన్‌ సిటీ పేరు సాధించిన ఇండోర్‌..ఇప్పుడు మొదటి వాటర్‌ ప్లస్‌ నగరంగా అవతరించిందన్నారు.

పోటీ తత్వంతోనే ప్రతి ఒక్కరు సమున్న విజయాలను అందుకోగలుగుతారని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. క్రీడలతో పాటు అంతరిక్ష పరిశోధనల్లో భారత్ అద్భుత ప్రగతిని సాధించిందని పేర్కొన్నారు. అరుదైన సెక్టార్లలో యువత వినూత్న రీతిలో విజయాలను అదుకోవడానికి తపన పడుతోందని, ఇది దేశ పురోగతికి, ఆత్మ నిర్భర్ భారత్‌కు నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ కితాబిచ్చారు. కృష్ణాష్ఠమి పర్వదినాన్ని పురస్కరించుకుని మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ మందిరం అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..

TV9 Exclusive: ఆఫ్గన్‌ రణక్షేత్రంలో టీవీ9 మరో సాహసం.. తాలిబన్‌ అధికార ప్రతినిధి సుహైల్‌ షాహీన్‌ ఎక్స్‌క్లూజీవ్‌ ఇంటర్వ్యూ..

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..
మొలకెత్తిన ఉల్లిపాయలు తినొచ్చా? ఒకవేళ తింటే ఏమవుతుంది..