IRCTC: ఆ రైలులో ప్రయాణిస్తే బహుమతులే బహుమతులు.. ఏ రైలులోనొ, ఎందుకోసమో తెలుసుకోండి!
ఐఆర్సీటీసీ నడుపుతున్న దేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ కొనసాగుతోంది.
IRCTC: ఐఆర్సీటీసీ నడుపుతున్న దేశపు మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక ఆఫర్ కొనసాగుతోంది. వాస్తవానికి, న్యూఢిల్లీ, లక్నో మధ్య నడుస్తున్న 82501/82502 తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా పథకం చాలాకాలంగా అమలులో ఉంది. అదేవిధంగా ప్రయాణీకులకు బహుమతులు ఇస్తూ వస్తున్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రీమియం రైళ్లకు ప్రయాణీకులను ఆకర్షించడానికి గతంలో వీటిని IRCTC ఉపయోగించింది. ఇప్పుడు IRCTC కొత్త లక్కీ డ్రా ఆఫర్‌తో వచ్చింది. లక్కీ డ్రా ద్వారా ఇందులో ప్రయాణించే ప్రయాణీకులకు బహుమతులు ఇస్తున్నారు. మీరు కూడా ఈ రైలులో ప్రయాణం చేయబోతున్నట్లయితే, మీ నంబర్ కూడా అదృష్ట ప్రయాణీకులలో వచ్చే అవాకాశం ఉంది. ఈ లక్కీ డ్రా ఆఫర్ గురించి తెలుసుకుందాం.
ఎగ్జిక్యూటివ్ క్లాస్ లోనే కాదు.. చైర్ కార్ ప్రయాణీకులకు కూడా..
ఆగస్టు 27 న, లక్నో నుండి న్యూఢిల్లీ వెళ్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో 13 మంది లక్కీ ప్యాసింజర్‌లను ఐఆర్సీటీసీ బహుమతులు ఇచ్చింది. ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రమే ఈ బహుమతి పథకం కాదు.. చైర్ కారులో ఉన్నవారికి కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 27 న, 13 మంది ఎగ్జిక్యూటివ్ క్లాస్ ప్యాసింజర్లు, 10 మంది చైర్ కార్ ప్యాసింజర్‌లు బహుమతులు తీసుకున్నారు. ప్రతిగా, న్యూఢిల్లీ నుండి లక్నో వస్తున్న 13 మంది ప్రయాణీకులకు కూడా బహుమతులు ఇచ్చారు.
సెప్టెంబర్ 6 చివరి తేదీ
IRCTC ఈ ఆఫర్ 27 ఆగస్టు నుండి ప్రారంభమైంది. దాని చివరి తేదీ సెప్టెంబర్ 6. తేజస్ ఎక్స్‌ప్రెస్ దేశంలో మొదటి ప్రైవేట్ రైలు ఐఆర్సీటీసీ ద్వారా నడపబడుతోంది. లాక్డౌన్ కారణంగా ఈ రైలు చాలా రోజులు రద్దయింది. ఇది ఇటీవల పునః ప్రారంభమైంది. ప్రయాణీకులను ఈ రైలు వైపు ఆకర్షించడానికి, ఐఆర్సీటీసీ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందిస్తోంది. ఈ క్రమంలో, ఐఆర్సీటీసీ లక్నో, న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా పథకాన్ని ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 వరకు ప్రారంభించింది.
PNR నంబర్ ఆధారంగా లక్కీ డ్రా
IRCTC ఈ పథకం కింద కంప్యూటర్ ఆధారిత లక్కీ డ్రా జరుగుతోంది. దీనిలో, కంప్యూటర్ చైర్ కారులో ప్రయాణిస్తున్న 10 మంది అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న 31మంది ప్రయాణికుల పేర్లను ఎంచుకుంటుంది. ప్రయాణీకులను వారి PNR ఆధారంగా ఎంపిక చేస్తారు. ఐఆర్సీటీసీ చీఫ్ రీజనల్ మేనేజర్ (ఉత్తర జోన్) అజిత్ కుమార్ సిన్హా ప్రకారం, లక్నో,న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణీకుల కోసం లక్కీ డ్రా పథకం రూపొందించారు.. ఈ లక్కీ డ్రా పథకంలో, తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించే ప్రయాణీకులను PNR ఆధారంగా కంప్యూటర్ ద్వారా ఎంపిక చేస్తారు. దీని తరువాత, ఈ అదృష్ట ప్రయాణీకులకు రైలులోనే ఐఆర్సీటీసీ బహుమతి ఇస్తోంది.
Also Read: Ration Card: రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నారా..! అయితే మారిన నిబంధనలు తెలుసుకోండి..
LIC Jeewan Amar: ఎల్ఐసి జీవన్ అమర్ పాలసీ..! తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు..