AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: చైనా-భారత్ మధ్య సత్సంబంధాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు..

భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. బుధవారం న్యూస్ వీక్ మ్యాజగైన్‎కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదం కారణంగా తలెత్తే అన్ని వివాదాలను ఇరు దేశాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనాతో స్థిరమైన, శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలు లేదా ప్రాంతం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రయోజనాల కోసం అవసరం అన్నారు ప్రధాని మోడీ.

PM Modi: చైనా-భారత్ మధ్య సత్సంబంధాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు..
Pm Modi
Srikar T
|

Updated on: Apr 11, 2024 | 11:28 AM

Share

న్యూఢిల్లీ, ఏప్రియల్ 11: భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. బుధవారం న్యూస్ వీక్ మ్యాజగైన్‎కు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదం కారణంగా తలెత్తే అన్ని వివాదాలను ఇరు దేశాలు పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనాతో స్థిరమైన, శాంతియుత సంబంధాలు కేవలం రెండు దేశాలు లేదా ప్రాంతం మాత్రమే కాకుండా ప్రపంచ ప్రయోజనాల కోసం అవసరం అన్నారు ప్రధాని మోడీ. భారత్‌కు, చైనాతో సంబంధం ముఖ్యమైనది. దౌత్య సంబంధాలతో పాటు సైనిక బలోపేతానికి ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. సానుకూల వాతావరణం ద్వారా మన సరిహద్దులలో శాంతి, ప్రశాంతతను పునరుద్ధరించగలమన్నారు. దీనిని తాను ప్రగాఢంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

ప్రజా మౌలిక సదుపాయాలను నిర్మించడంతోపాటు ప్రపంచ వ్యాపారాలను భారత్ తో ఎగుమతి, దిగుమతి చేసుకోవడంలో సమాయపడుతుందన్నారు. తూర్పు పొరుగు దేశంతో పోటీపడి దూసుకుపోతున్న భారతదేశంపై ప్రశంశల వర్షం కురిపించారు. ప్రస్తుతం గ్లోబలైజేషన్లో పెరుగుతున్న ప్రపంచ శక్తికి తమ వంతు సహకారం అందించేందుకు కలిసి వస్తుందన్నారు. దీనిని ఒక చైన్ లింక్ వ్యవస్థ ద్వారా వృద్ది చేయడం వల్ల వ్యాపారాలను విస్తరించాలనుకునే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. FDI నిబంధనలలో కొన్ని సడలింపులు ఇవ్వడం వల్ల పొరుగుదేశాలతో వ్యాపారం చేయడం సులభతరమైందని వివరించారు. ఫారిన్ ఇంపోర్ట్స్, ఎక్స్ పోర్ట్స్ నిర్వహణలో భారత్ గణనీయమైన అభివృద్ధి సాధించిందన్నారు. భారతదేశంలో ఉత్పాదక సామర్థ్యాలను ఎలక్ట్రానిక్స్, సోలార్ మాడ్యూల్స్, వైద్య పరికరాలు, ఆటోమొబైల్స్‌తో సహా ఇలా 14 రంగాలకు విస్తరించామని చెప్పారు.

మతపరమైన వివక్షపై..

దేశంలో మతపరమైన ప్రచారంతో పాటు మైనారిటీలపై వివక్షకు సంబంధించిన ఆరోపణలను తోసిపుచ్చారు ప్రధాని మోడీ. ఇవి సమాజంలో బడుగు బలహీనవర్గాలతో కలిసేందుకు ఇష్టపడని కొంతమంది వ్యక్తులు చేసే అరోపణలు అని అన్నారు. దేశంలో అన్ని మతాలకు చెందిన మైనారిటీల గురించి ప్రస్తావించారు. అది ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు లేదా పార్సీల వంటి విభిన్న జాతుల వారు భారతదేశంలో సంతోషంగా జీవిస్తున్నారని వివరించారు. మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అందించే పథకాలు, కార్యక్రమాలు విస్తృతంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, అట్టడుగువర్గాల వారికి చేరాయని పేర్కొన్నారు. ప్రజలకు ఈ విధానాల పట్ల సంతృప్తి పొందినట్లు చెప్పారని తెలిపారు. తాము రూపొందించిన సంక్షేమ పథకాలు కేవలం ఒక ప్రాంతానికో, ఒక మతానికి చెందిన వ్యక్తుల సమూహానికో పరిమితం చేయలేదన్నారు. అవి అందరికీ చేరేలా ఉంటాయని వివరించారు. అంటే ఎలాంటి వివక్షకు తావులేని విధంగా రూపొందించామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..