సెలవు రోజున పని చేస్తున్న పాఠశాల.. స్కూల్ బస్సు బోల్తా.. ఆరుగురు చిన్నారులు దుర్మరణం
ఈ స్కూల్ బస్సు GL పబ్లిక్ స్కూల్‌కు చెందినదిగా చెబుతున్నారు. ఈ బస్సులో దాదాపు 30-35 మంది విద్యార్థిని, విద్యార్థులున్నారు. వాస్తవానికి ఈ రోజు ఈద్. ఈ పండగ అధికారిక సెలవు. అయినప్పటికీ సెలవు రోజున స్కూల్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటన తర్వాత పాఠశాల నిర్వహణపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గాయపడిన చిన్నారుల్లో కొంతమందిని రేవారిలో, మరికొంత మందిని మహేంద్రగఢ్ ఆసుపత్రిలో చేర్చారు. స్వల్ప గాయాలు అయిన 8 మంది చిన్నారులను చికిత్స తర్వాత నిహాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లా నార్నాల్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కనీనాలోని ఉన్‌హాని గ్రామ సమీపంలో స్టూడెంట్స్ తో నిండిన స్కూల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. 28 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి అధికార యంత్రాంగం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ స్కూల్ బస్సు GL పబ్లిక్ స్కూల్‌కు చెందినదిగా చెబుతున్నారు. ఈ బస్సులో దాదాపు 30-35 మంది విద్యార్థిని, విద్యార్థులున్నారు. వాస్తవానికి ఈ రోజు ఈద్. ఈ పండగ అధికారిక సెలవు. అయినప్పటికీ సెలవు రోజున స్కూల్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఘటన తర్వాత పాఠశాల నిర్వహణపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రేవారి-మహేంద్రగఢ్ రహదారిలోని ఉన్హాని గ్రామ సమీపంలో పిల్లలతో నిండిన పాఠశాల బస్సు ప్రమాదానికి గురైందని ప్రమాదం తర్వాత సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు తెలిపారు. జీఎల్ పబ్లిక్ స్కూల్ కు చెందిన ఈ బస్సులో 30 నుంచి 35 మంది చిన్నారులు ఉన్నారు. గాయపడిన చిన్నారుల్లో కొంతమందిని రేవారిలో, మరికొంత మందిని మహేంద్రగఢ్ ఆసుపత్రిలో చేర్చారు. స్వల్ప గాయాలు అయిన 8 మంది చిన్నారులను చికిత్స తర్వాత నిహాల్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు.
సెలవు రోజున కూడా పని చేస్తున్న స్కూల్
ఈ రోజు ఈద్ ఉల్ ఫితర్ పండుగ. ఈద్ పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా పబ్లిక్ హాలీ డే గా ప్రకటించారు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ పాఠశాలలో తరగతులు నిర్వహిస్తున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా పిల్లలను బస్సులో పాఠశాలలకు తీసుకెళ్తున్నారు. ఈ కోణంలో పోలీసు యంత్రాంగం విచారణ జరిపి పాఠశాలపై చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు అధికారులు చెప్పారు.
రక్తమోడిన సంఘటన స్థలం
స్కూల్ బస్సు బోల్తా పడడంతో ఘటనా స్థలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బస్సు నుంచి వినిపించిన హాహాకారాలను విని తాము ఉల్కి పడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే స్పందించిన స్థానికులు బస్సు కింద పడి ఉన్న పిల్లలను రక్షించడం ప్రారంభించారు. బస్సు బోల్తా పడడంతో చిన్నారుల చేతులు, కాళ్లు, తలపై తీవ్ర గాయాలయ్యాయి. కొంతమంది పిల్లలకు తల, చేతులు, కాళ్ల నుంచి రక్త స్రావం భారీగా జరిగినట్లు తెలుస్తోంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..