AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల కోసం ఉద్యోగం మానేసిన అమ్మ.. ద్రాక్ష పండ్లతో గంటకు 16 వేలు సంపాదిస్తోంది.

ఫుల్‌టైమ్ జాబ్ చేయడం ద్వారా సంపాదించగలిగే డబ్బు కంటే ఇంట్లో కూర్చొని 'సైడ్ వర్క్' చేయడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది. ప్రతిరోజూ ఒక గంట మాత్రమే పనిచేసి దాదాపు రూ.16 వేలు సంపాదిస్తున్న ఓ మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ద్రాక్షపండ్లు అందరికీ తెలిసిన పండ్లే.. ఈ ద్రాక్ష గుత్తుల నుంచి మహిళ చాలా సంపాదిస్తోంది. ఇది తెలిసి  ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ మహిళ పేరు బ్రిజా జిజెల్. ది సన్ నివేదిక ప్రకారం.. ఆమె ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ వైపు ఉద్యోగం, మరోవైపు తన పిల్లలను చూసుకోవడం చాలా కష్టంగా మారింది.

పిల్లల కోసం ఉద్యోగం మానేసిన అమ్మ.. ద్రాక్ష పండ్లతో గంటకు 16 వేలు సంపాదిస్తోంది.
Woman Set Up A Side Hustle
Surya Kala
|

Updated on: Apr 11, 2024 | 11:48 AM

Share

కొంతమందికి ఈ ప్రపంచంలో డబ్బు సంపాదించడం చాలా కష్టమైన పని. పగలనక రాత్రీపని చేస్తూ  ఇప్పటికీ నెలకు అతి కష్టం మీద 25-30 వేల రూపాయలు సంపాదిస్తారు. అయితే ఇంట్లో కూర్చొని అతి సాధారణ పనిని చేస్తూ గంటలో వేల రూపాయలు సంపాదించే వారు ప్రపంచంలో కొందరున్నారు. ఫుల్‌టైమ్ జాబ్ చేయడం ద్వారా సంపాదించగలిగే డబ్బు కంటే ఇంట్లో కూర్చొని ‘సైడ్ వర్క్’ చేయడం ద్వారా ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది. ప్రతిరోజూ ఒక గంట మాత్రమే పనిచేసి దాదాపు రూ.16 వేలు సంపాదిస్తున్న ఓ మహిళ ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది.

ద్రాక్షపండ్లు అందరికీ తెలిసిన పండ్లే.. ఈ ద్రాక్ష గుత్తుల నుంచి మహిళ చాలా సంపాదిస్తోంది. ఇది తెలిసి  ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఆ మహిళ పేరు బ్రిజా జిజెల్. ది సన్ నివేదిక ప్రకారం.. ఆమె ఉద్యోగం చేస్తున్న సమయంలో ఓ వైపు ఉద్యోగం, మరోవైపు తన పిల్లలను చూసుకోవడం చాలా కష్టంగా మారింది. అందుకే బ్రిజ ఉద్యోగం మానేయాలని ఆలోచించింది. ఉద్యోగం మానేస్తే వచ్చే సమస్య ఏమిటంటే.. ఉద్యోగం మానేస్తే.. ఇంట్లో పిల్లలను చాలా కేరింగ్ గా చూసుకుంటుంది. అదే సమయంలో నెల జీతం అందదు. దీంతో కుటుంబంలో ఆదాయ వనరు క్లోజ్ అవుతుంది.

ద్రాక్ష నుంచి ప్రత్యేక మిఠాయి తయారీ

తర్వాత చాలా తర్జనభర్జనలు పడింది. చివరకు బ్రిజ ఒక ‘సైడ్ హస్టిల్’ అంటే ఒక రకమైన సైడ్ బిజినెస్ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ సైడ్ ద్వారా ఇంట్లో కూర్చొని మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు. అదే సమయంలో పిల్లలను కూడా చూసుకోవచ్చు అని ఆలోచించింది. నివేదికల ప్రకారం బ్రిజా ద్రాక్షతో ఒక ప్రత్యేకమైన మిఠాయిని తయారు చేస్తుంది. ఇది చాలా ఖరీదైన ధరకు అమ్ముతుంది. 158 రూపాయలకు ద్రాక్ష గుత్తిని కొనుగోలు చేసి కేవలం 10 ద్రాక్ష పండ్లను ఉపయోగించి మిఠాయి ప్యాకెట్‌ను తయారు చేసి సుమారు 844 రూపాయలకు విక్రయిస్తోంది. ద్రాక్ష గుత్తుల నుంచి గంట వ్యవధిలో పలు మిఠాయి ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తూ సుమారు రూ.16 వేలు సంపాదిస్తోంది.

మార్కెట్‌లో మిఠాయిలకు డిమాండ్‌

ద్రాక్ష నుంచి తయారు చేసున్న మిఠాయికి భారీ డిమాండ్ ఉంది. ఈ మిఠాయిని తయారు చేయడానికి, తాను చక్కెర, మొక్కజొన్న సిరప్, రెడ్ ఫుడ్ కలర్, మెక్సికన్ మసాలా తజిన్‌ను ఉపయోగిస్తానని బ్రిజా చెప్పింది. బ్రిజ తయారు చేసిన మిఠాయికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. చాలా మంది ఆమె ఇంటికి వచ్చి ఆర్డర్ చేసి, అది సిద్ధమైన తర్వాత స్వయంగా తీసుకుని వెళ్లారు కూడా.. ఇలా చేయడం వలన వారి డెలివరీ ఖర్చులను ఆదా చేసుకుంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
గురువారం పసుపు రంగు దుస్తులు ధరిస్తున్నారా? గురు గ్రహ అనుగ్రహం..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
టోల్ ఛార్జీలపై బిగ్ అప్డేట్.. ఇకపై పదే పదే ఆగాల్సిన పని లేదు..
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
వర్షాకాలంలో ఐస్‌క్రీమ్ సేఫేనా.. తినే ముందు ఇవి అప్పక తెలుసుకోండి!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
తండ్రికి ప్రాణదానం చేసిన ఇద్దరు కూతుళ్లు..!
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
వర్షాకాలంలో ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫ్రూట్స్
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
30 రోజుల్లో ఈ పని చేయకపోతే ఇబ్బందులే.. వాహనదారులకు అలర్ట్..
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
శని వక్రగతి.. ఈ 4 రాశుల అదృష్టం మారబోతోందా? ధనలాభాలు, ప్రమోషన్స్
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
చిన్న గింజల్లో పెద్ద ఆరోగ్య ప్రయోజనాలు.. చిటికెడు తిన్నా చాలు
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
జీ-7లో మోదీని చూసి మెలోని ఫన్నీ కామెంట్..!
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ
కూరగాయలు కోసే ఓపిక లేనప్పుడు 5 నిమిషాల్లో చేసుకునే పాతకాలం రెసిపీ