AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొడవులో తల్లిదండ్రులను మించిన తనయుడు.. కొడుకు ఎత్తు చూస్తే షాక్ తినాల్సిందే..

బ్యూ తన మంచాన్ని 9 అడుగుల పొడవు చేసానని.. తద్వారా అతను హాయిగా నిద్రపోతున్నానని చెప్పాడు. అయితే అతను తన బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు నిద్రించడానికి ఇబ్బందిగా ఉందని ఎందుకంటే అక్కడ మంచం గరిష్టంగా 6 అడుగుల పొడవు ఉంటుందని చెప్పారు. అటువంటి పరిస్థితిలో తాను మంచం మీద నిద్రిస్తుంటే కాలులో కొంత భాగం మంచం నుంచి కిందకు వేలాడుతూ ఉంటుంది. అంతేకాదు ఇంటి పైకప్పు, తలుపులు కూడా బ్యూకి ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్నిసార్లు అతను గాయపడతారు కూడా.

పొడవులో తల్లిదండ్రులను మించిన తనయుడు.. కొడుకు ఎత్తు చూస్తే షాక్ తినాల్సిందే..
Beau BrownImage Credit source: Instagram/bigbeaubrown
Surya Kala
|

Updated on: Apr 11, 2024 | 10:37 AM

Share

ఎత్తు పెరగడం సహజం.. అంటే ఒకరి ఎత్తు ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. చాలా వరకు.. ఎత్తు పెరగడం అనేది కుటుంబంలోని జన్యువులపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే కుటుంబంలో ఎవరైనా పొడవుగా ఉంటే.. అప్పుడు పిల్లలు కూడా పొడవుగా ఉండే అవకాశాలు పెరుగుతాయి. అంటే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ను చూడండి. అతని ఎత్తు 6 అడుగుల కంటే ఎక్కువ.. అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ ఎత్తు కూడా 6 అడుగుల కంటే ఎక్కువ. అదే విధంగా ఓ కుటుంబం ప్రస్తుతం వార్తల్లో ఉంది. ఇందులో అందరూ ఎత్తుగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఓ యువకుడు తన తల్లిదండ్రుల కంటే చాలా పొడవుగా ఎదిగాడు. దీంతో అతను భారీగా కనిపిస్తున్నాడు.

ఈ కుటుంబం అమెరికాలోని జార్జియాలో నివాసం ఉంటుంది. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం 30 ఏళ్ల బ్యూ బ్రౌన్ ఎత్తు 7 అడుగుల 1 అంగుళం. అతని తండ్రి 6 అడుగుల 9 అంగుళాల పొడవు. బ్యూ తల్లి లిసా కూడా 6 అడుగుల పొడవు ఉంటుంది. ఇప్పుడు బ్యూ 7 అడుగుల కంటే ఎక్కువ పొడవుగా ఎదిగాడు. ప్రస్తుతం వార్తల్లో వీరి పొడవు నిలిచింది. అయితే అతని ఎత్తు అతనికి సమస్యలను సృష్టిస్తుంది. ముఖ్యంగా అతని చిన్నతనంలో సమస్యలు చాలా తరచుగా ఎదురయ్యేవి.

జనన ధృవీకరణ పత్రం చూపించాల్సి వచ్చింది

బ్యూ తన వయస్సు పిల్లలతో బేస్ బాల్ ఆడాలని అనుకుంటే.. అతను మొదట తన జనన ధృవీకరణ పత్రాన్ని చూపించి.. తాను ఆ పిల్లల వయస్సు వాడినే అని నిర్ధారించాల్సి ఉండేది. ఎందుకంటే అతని ఎత్తు ప్రజలను ఆలోచింపజేస్తుంది. కేవలం 14 సంవత్సరాల వయస్సులో అతని ఎత్తు 6 అడుగులు. అది క్రమంగా పెరుగుతూ వచ్చింది.

ఇవి కూడా చదవండి

9 అడుగుల పొడవైన మంచం

నివేదికల ప్రకారం బ్యూ తన మంచాన్ని 9 అడుగుల పొడవు చేసానని.. తద్వారా అతను హాయిగా నిద్రపోతున్నానని చెప్పాడు. అయితే అతను తన బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు నిద్రించడానికి ఇబ్బందిగా ఉందని ఎందుకంటే అక్కడ మంచం గరిష్టంగా 6 అడుగుల పొడవు ఉంటుందని చెప్పారు. అటువంటి పరిస్థితిలో తాను మంచం మీద నిద్రిస్తుంటే కాలులో కొంత భాగం మంచం నుంచి కిందకు వేలాడుతూ ఉంటుంది. అంతేకాదు ఇంటి పైకప్పు, తలుపులు కూడా బ్యూకి ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్నిసార్లు అతను గాయపడతారు కూడా.

రోడ్డు మీద నడిచేవాళ్లు

బ్యూ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను ఫోర్డ్ కి చెందిన F-50 ట్రక్కును నడుపుతున్నాడు. తాను రోడ్డుపైకి వచ్చే సమయంలో తన ఎత్తును చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని బ్యూ స్వయంగా చెప్పారు. వ్యక్తుల చూపులు, చర్యలు తనకు అసౌకర్యాన్ని కలిగిస్తాయని చెప్పారు. చాలా మంది ప్రజలు అతనిని ఒక సెలబ్రిటీలా చూస్తారు. అతనితో ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..