AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భర్త పైచాచిక ఆనందం.. భార్యపై కోపంతో ఏం చేశాడంటే..?

ఒక భర్త మాత్రం తన భార్యని కాల్ గర్ల్ గా పది మందికి పరిచయం చేస్తూ భార్య విషయంలో ఏ మనిషి చేయని పనిని చేశాడు. మీకు కాల్ గర్ల్ కావాలంటే ఫోన్ చేయండి అంటూ ఓ వ్యక్తి తన భార్య ఫొటో, ఫోన్ నంబర్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వింత ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ప్రస్తుతం బెంగళూరులోని నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై కేసు నమోదైంది. దంపతుల మధ్య విభేదాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. 

భర్త పైచాచిక ఆనందం.. భార్యపై కోపంతో ఏం చేశాడంటే..?
Bengaluru Man
Surya Kala
|

Updated on: Apr 11, 2024 | 11:35 AM

Share

రోజురోజుకీ మనషుల మధ్య బంధాలకు బీటలు పడుతున్నాయి. మేము మనది నుంచి నేను నాది అనే స్టేజ్ కు చేరుకొని ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబాలకు, చివరికి నేను బాగుంటే చాలు అనే స్టేజ్ చేరుకున్నారు. అయితే భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. తనను నమ్మి తల్లిదండ్రులను రక్తసంబంధాన్ని విడిచి తన ఇంటికి వచ్చిన భార్యను ప్రేమగా భర్తలు చూస్తారు. అయితే ఒక భర్త మాత్రం తన భార్యని కాల్ గర్ల్ గా పది మందికి పరిచయం చేస్తూ భార్య విషయంలో ఏ మనిషి చేయని పనిని చేశాడు. మీకు కాల్ గర్ల్ కావాలంటే ఫోన్ చేయండి అంటూ ఓ వ్యక్తి తన భార్య ఫొటో, ఫోన్ నంబర్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన వింత ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ప్రస్తుతం బెంగళూరులోని నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై కేసు నమోదైంది. దంపతుల మధ్య విభేదాలే ఈ ఘటనకు ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే..

నందిని లే అవుట్‌కు చెందిన సత్యనారాయణరెడ్డికి అతని భార్యకు మధ్య గొడవలు జరిగాయి. 2019లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఏడాది కాలంగా విడిగా ఉంటున్నారు. గత ఏడాది కాలంగా భర్తకు శారీరకంగా, మానసికంగా ఆసరాగా ఉండకుండా సత్యనారాయణ రెడ్డికి అతని భార్య దూరంగా ఉంటుంది. దీంతో తన  భార్యపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. చివరకు నిందితుడు సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో తన భార్య కాల్ గర్ల్ అని పోస్ట్ చేసినట్లు సమాచారం.

నిందితుడు ‘కళా శశి’ పేరుతో ఫేస్‌బుక్ పేజీని క్రియేట్ చేసి.. అందులో తన భార్య ఫొటోని .. ఆమె ఫోన్ నంబర్ ని ఆమె సోదరుడి మొబైల్ నంబర్‌ను పోస్ట్ చేశాడు. అంతే కాకుండా కాల్ గర్ల్ కావాలంటే తనను సంప్రదించండి అంటూ పోస్ట్ చేశాడు. అప్పటి నుంచి బాధితురాలికి, ఆమె సోదరుడికి ఫోన్లు రావడం మొదలయ్యాయి. అప్పుడు అసలు విషయం నిందితుడి భార్యకు తెలిసింది. భర్త ప్రవర్తనతో విసిగిపోయిన బాధితురాలు, ఆమె సోదరుడుతో కలిసి ఆమె భర్తపై నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..