AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి, కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే డిమాండ్

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని ఆయన అన్నారు. ఇటీవల పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ...

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలి, కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే డిమాండ్
Presidemt's Rule Should Be Imposed In Maharashtra Says Union Minister Ramadas Athawale
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 20, 2021 | 1:46 PM

Share

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర మంత్రి రామదాస్ అథవాలే డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దిగజారిందని ఆయన అన్నారు. ఇటీవల పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనంలో ప్రమాదకరమైన జిలెటిన్ స్టిక్స్ కనబడడం,  ఈ కేసులో సస్పెండయిన పోలీసు అధికారి సచిన్ వాజే పాత్ర ఉన్నట్టు నిర్ధారణ కావడం, ఆయనను ఎన్ఐఏ  అరెస్టు చేసి విచారించడం వంటి పరిణామాలను ఆయన ప్రస్తావించారు. ఇదంతా  చూస్తుంటే ఈ వ్యవహారంలో బలమైన కుట్ర ఏదో ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోందన్నారు. దేశంలో బడా పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ సంస్థలో వేలాది ఉద్యోగులు పని చేస్తుంటారని, అలాంటిది అక్కడ నిర్మానుష్య ప్రదేశంలో ఈ అనుమానాస్పద  వాహనం కనబడడం, ఈ వాహన యజమాని మాన్ సుఖ్ హీరేన్ మృతి వంటి ఘటనలను కూడా అథవాలే గుర్తు చేశారు. ఇవన్నీ ఒకదానికొకటి లింక్ కలిగిఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గల ఈ విధమైన  ఘటనలను  హ్యాండిల్ చేయడంలో విఫలమైందని  రామదాస్ అథవాలే ఆరోపించారు.

ఇలా ఉండగా థానేలో  మాన్ సుఖ్ హీరేన్ మృతి చెందిన ప్రదేశంలోనే శనివారం మరో మృత దేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఇతడిని 48 ఏళ్ళ షేక్ సలీం అబ్దుల్ గా గుర్తించారు. అయితే ఇది అనుమానాస్పద ఘటన కాదని, ఇతడొక కూలీ అని భావిస్తున్నామని పోలీసులు చెప్పారు.  చుట్టూ పొదలు, కాలువ గల ఈ ప్రాంతంలో ఈ వ్యక్తి  లోతైన కాలువలోజారి పడి ఉండవచ్చునని. ఇతని మృత దేహాన్ని ఆటాప్సీ కోసం ఆసుపత్రికి తరలించామని వారు చెప్పారు.  సచిన్ వాజే ఉదంతం సెన్సేషనలైజ్ కావడం, పైగా  ఇదే చోట షేక్ మృతదేహం కూడా కనబడడంతో ఈ కేసు కాస్త మిస్టరీగా మారింది. ఇప్పటికే సచిన్ వాజెని ఎన్ఐఎ అధికారులు అరెస్టు చేసి విచారిస్తున్న విషయం  తెలిసిందే. మరిన్ని చదవండి ఇక్కడ :మార్స్ పై నీటిజాడ..గురించి సంచలన నిజాలు వెల్లడించిన నాసా : water on Mars Video ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన స్నేక్ ఐలాండ్ వీడియో…ఒళ్ళు గగ్గురుపరిచే నిజాలు : Snake Island Videoఆర్ ఆర్ ఆర్ మరో సినిమా..ఆసక్తికరంగా మారిన ప్రకటన :Paired Opposite Jr NTR In RRR Video.

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...