Marriage Counselling: పెళ్లికి ముందు వధూవరులు కౌన్సెలింగ్‌కు రావాల్సిందే.. కేరళ మహిళా కమిషన్ నిర్ణయం..
గృహ హింస, వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులను అరికట్టేందుకు కేరళ మహిళా కమిషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది.

గృహ హింస, వరకట్న వేధింపులు, వివాహితులపై దాడులను అరికట్టేందుకు కేరళ మహిళా కమిషన్ ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. దాంపత్య బంధానికి అధికారిక గుర్తింపు పొందాలంటే వధూవరులు ఇకపై తప్పనిసరిగా ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించింది. అంతేకాదు వివాహ రిజిస్ట్రేషన్ సమయంలో ఈ కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు సంబంధిత ధ్రువ పత్రం సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది.
మహిళలపై అఘాయిత్యాలు అరికట్టేందుకే..
ఇటీవల కేరళ రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. గృహహింస, వరకట్న వేధింపల కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా వీటిని అనుభవించలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరికొందరు దారుణ హత్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా ఉత్రా కేసు( పాముతో భార్యను చంపించిన సంఘటన), విస్మయ ( వరకట్న వేధింపలతో ఆత్మహత్య చేసుకున్న మెడికల్ స్టూడెంట్) కేసులు దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రి వెడ్డింగ్ కౌన్సెలింగ్ ను అమల్లోకి తీసుకొస్తున్నట్లు కేరళ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సతీదేవి తెలిపారు. దాంపత్య బంధంలో ఉండే సాధక బాధకాలను ఈ కౌన్సెలింగ్‌లో వధూవరులకు వివరించనున్నట్లు ఆమె పేర్కొంది.
Also Read:




