Sabyasachi Mukjerhee: బీజేపీ మంత్రి అల్టిమేటం.. మంగళసూత్రం యాడ్ ఉపసంహరణ..
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఇటీవల చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. స్టైలిష్ డిజైనర్‌గా మంచి పేరున్న
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ ఇటీవల చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. స్టైలిష్ డిజైనర్‌గా మంచి పేరున్న ఆయన మూడు రోజుల క్రితం ‘మంగళసూత్ర’ పేరుతో రూపొందించిన ఓ యాడ్ వివాదాస్పదమైంది. ఇందులో భాగంగా ఇంటిమేట్‌ఫైన్ జ్యూయల్లరీ థీమ్‌తో ఆయన నిర్వహించిన ఫొటోషూట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇవేమైనా లింగరీ, కండోమ్ ప్రకటనలా’, ‘పవిత్ర మంగళ సూత్రం కోసం ఇలాంటి ఫొటోషూట్ చేస్తావా’ అంటు పలువురు ప్రముఖులు సబ్యసాచిపై దుమ్మెత్తి పోశారు. ఇక ఒక అడుగు ముందుకేసిన పలువురు బీజేపీ నేతలు ఆయనకు లీగల్ నోటీసులు పంపారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ హోం శాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా..24 గంటల్లోపు యాడ్‌ను ఉపసంహరించుకోవాలని అల్టిమేటమ్ జారీ చేశారు. లేకపోతే ఇంటికి పోలీసులను పంపిస్తానని హెచ్చరించారు.
అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం.. ఈ క్రమంలో తమ యాడ్‌పై వస్తోన్న విమర్శలపై స్పందించిన డిజైనర్ సంస్థ తాజాగా వివాదాస్పద ప్రకటనను ఉపసంహరించుకుంది. ‘వారసత్వం, సంస్కృతిని మరింత డైనమిక్ సంభాషణగా మార్చే క్రమంలో ఈ మంగళసూత్ర యాడ్‌ను రూపొందించాం. అయితే ఈ ప్రకటన సమాజంలోని కొన్ని వర్గాల మనోభావాలను కించపరిచేలా ఉందని తెలిసింది. ఇందుకు మేం చాలా బాధపడుతున్నాం. సబ్యసాచి ముఖర్జీ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు’ అని డిజైనర్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.