బీహార్ ఎన్నికల్లో మేమే ఎక్కువ సీట్లకు పోటీ చేస్తాం.. పీకే

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కన్నా సీనియర్ భాగస్వామి అయిన తమ పార్టీయే ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుందని జేడీ-యు జాతీయ ఉపాధ్యక్షుడు, మునుపటి ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో వచ్ఛే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడీ-యు, బీజేపీ రెండూ సరిసమాన సీట్లకు పోటీ చేశాయి. కానీ లోక్ సభ ఎన్నికల ఫార్ములా అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ కాదని పీకే కుండబధ్ధలు […]

  • Pardhasaradhi Peri
  • Publish Date - 3:35 pm, Mon, 30 December 19
బీహార్ ఎన్నికల్లో మేమే ఎక్కువ సీట్లకు పోటీ చేస్తాం.. పీకే

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కన్నా సీనియర్ భాగస్వామి అయిన తమ పార్టీయే ఎక్కువ సీట్లకు పోటీ చేస్తుందని జేడీ-యు జాతీయ ఉపాధ్యక్షుడు, మునుపటి ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. ఈ రాష్ట్రంలో వచ్ఛే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గత మే నెలలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జేడీ-యు, బీజేపీ రెండూ సరిసమాన సీట్లకు పోటీ చేశాయి. కానీ లోక్ సభ ఎన్నికల ఫార్ములా అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ కాదని పీకే కుండబధ్ధలు కొట్టారు. సవరించిన పౌరసత్వ చట్టం , ఎన్నార్సీలను అమలులోకి తెచ్చిన బీజేపీపై ప్రశాంత్ కిషోర్ అదేపనిగా దుయ్యబడుతున్న విషయం తెలిసిందే.. రాబోయే బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీపై జనతాదళ్-యు పట్టు సాధించాలన్న లక్ష్యంతోనే ఆయన ఉన్నట్టు కనిపిస్తోంది.

జేడీ-యుకు 70 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీ సభ్యుల సంఖ్య 50 మాత్రమేనని ఆయన చెప్పారు. బీజేపీ ఒత్తిడులకు తమ పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్ తలొగ్గవచ్చునన్న ఊహాగానాలను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. ఈ రాష్ట్రంలో మాదే అతి పెద్ద పార్టీ అన్న విషయం మీకు తెలియదా అని మీడియాను ప్రశ్నించారు. కాగా-వచ్ఛే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ-యు ఎక్కువ సీట్లు కోరుతుందన్న ఆయన వ్యాఖ్యలపై బీహార్ లోని బీజేపీ వర్గాల్లో అప్పుడే కలవరం మొదలైంది. అసలు సీట్ల పంపిణీపై మాట్లాడే అధికారం ఆయనకు ఎక్కడిదని బీజేపీ నేత నితిన్ నవీన్ ప్రశ్నించారు. బహుశా అది పీకే వ్యక్తిగత అభిప్రాయమై ఉండవచ్ఛునన్నారు.