చల్లారని ఉద్రిక్థత..అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరం పోలీసుల కేసు.. ఉన్నతాధికారుల పైనా ఎఫ్ఐఆర్

Umakanth Rao

Umakanth Rao | Edited By: Phani CH

Updated on: Jul 31, 2021 | 9:39 AM

అస్సాం. మిజోరాం రాష్ట్రాల మధ్య రేగిన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పైన, ఆరుగురు పోలీసు ఉన్నతాధికారులతో సహా 200 మంది పోలీసులపై మిజోరం పోలీసులు కేసు దాఖలు చేశారు.

చల్లారని ఉద్రిక్థత..అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరం  పోలీసుల కేసు.. ఉన్నతాధికారుల పైనా ఎఫ్ఐఆర్
Himanta Biswa Sarma

అస్సాం మిజోరాం రాష్ట్రాల మధ్య రేగిన ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పైన, ఆరుగురు పోలీసు ఉన్నతాధికారులతో సహా 200 మంది పోలీసులపై మిజోరం పోలీసులు కేసు దాఖలు చేశారు. అస్సాం ఐజీపీ, ఎస్పీ, కచార్ జిల్లా డిప్యూటీ కమిషనర్ పేర్లు వీటిలో ఉన్నాయి. మిజోరం లోని కొలాసిబ్ జిల్లా సరిహద్దుల్లోని పోలీసు స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి. కచార్ జిల్లా బోర్డర్ పరిసర ప్రాంతాల్లో నివురు గప్పిన నిప్పులా ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అంతకుముందు మిజోరంకు చెందిన ఎంపీలతో సహా పలువురు ప్రముఖులకు అస్సాం పోలీసులు సమన్లు జారీ చేశారు. ఢిల్లీలోని ఈ ఎంపీల నివాసాలకు అస్సాం పోలీసులు వెళ్లి వీటిని అందజేయడం విశేషం. గత సోమవారం ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఉభయ రాష్ట్రాల పోలీసులు, స్థానికుల మధ్య జరిగిన హింసలో ఏడుగురు అస్సాం పోలీసులు మరణించగా.. రెండు రాష్ట్రాలకు చెందిన సుమారు 80 మంది గాయపడ్డారు. అప్పటి నుంచి రెండు రాష్ట్రాలూ కలహించుకుంటున్నాయి.

మిజోరరం పోలీసుల అత్యుత్సాహాన్ని, వారి కాల్పుల ఉదంతాన్ని అస్సాం సీఎం వీడియోల రూపంలో విడుదల చేయగా.. అలాగే మిజోరం సీఎం జొరాంతంగా కూడా తానూ తక్కువ తినలేదని అస్సాం పోలీసుల ‘దాష్టీకాన్ని’ వీడియోలుగా తన ట్విట్టర్లో షేర్ చేశారు. వీరి ప్రభుత్వాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతతో రెండు రాష్ట్రాల సరిహద్దుల వద్ద పెద్దఎత్తున పారా మిలిటరీ బలగాలను మోహరించారు. అదనంగా నిన్న రెండు కంపెనీల బలగాలు ఇక్కడికి చేరుకున్నాయి. అస్సాం పోలీసులపై తాము పగ తీరుచుకుంటామని మిజోరాం ఎంపీ ఒకరు బాహాటంగా చేసిన హెచ్చరికతో పరిష్టితి మరింత రాజుకుంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక

Students Death: స్నానానికి వెళ్లి ఇద్దరు విద్యార్థినులు జలసమాధి.. శోకసంద్రంలో గిరిజన కుటుంబాలు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu