Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక

Venu Aravind: నటుడు, దర్శకుడు వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని  కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వేణు అరవింద్ కోమా స్థితిలో ఉన్నాడని వైద్యులు..

Venu Aravind: టీవీ సీనియర్ యాక్టర్ వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమం అంటూ వార్తలు.. స్పందించిన రాధిక
Venu Aravind
Follow us
Surya Kala

|

Updated on: Jul 31, 2021 | 9:33 AM

Venu Aravind: నటుడు, దర్శకుడు వేణు అరవింద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని  కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. వేణు అరవింద్ కోమా స్థితిలో ఉన్నాడని వైద్యులు చెప్పారు. వేణు అరవింద్ హఠాత్తుగా అస్వస్థకు గురికావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.వేణు అరవింద్ తెలుగు, తమిళ సీరియల్స్ లో నటించి..మంచి నటుడుగా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ముఖ నటి రాధిక నటించిన ‘వాణి రాణి’ అనే సీరియల్‌లో ఆమెకు భర్తగా నటించారు. బుల్లి తెర ప్రేక్షకులమనసులో మంచి ప్లేస్ ను సంపాదించుకున్నారు. అనంతరం వెండి తెరపై నటుడిగా అడుగు పెట్టి.. అంద ఒరు నిమిడం, పడిక్కాద పణ్ణైయార్‌, అలైపాయుదే, నరసింహా, వల్లవన్‌, వేగం వంటి అనేక చిత్రాల్లో నటించాడు.. శభాష్‌ సరియాన పోటీ అనే చిత్రంతో మెగా ఫోన్ పట్టుకుని.. దర్శకుడిగా వెండి తెరకు పరిచయం అయ్యారు.

ఇటీవల కరోనా వైరస్‌ బారినపడిన వేణు అరవింద్‌ చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు. అయితే ఉన్నట్టుండి మళ్ళీ వేణు అరవింద్ అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆస్పత్రిలో చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు నిమోనియా సోకినట్లు తెలియడంతోసి చికిత్సనందిస్తున్నారు., అయితే ఈ క్రమంలో వేణు బ్రెయిన్‌లో చిన్నపాటి గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించి తక్షణం ఆపరేషన్‌ చేసి తొలగించారు. ఈ చికిత్స తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. వేణు అరవింద్‌ త్వరగా కోలుకోవాలని ఆయన హితులు, స్నేహితులు, అభిమానులు కోరుతున్నారు. అయితే వేణు అరవింద్ కోమాలో ఉన్నారనే వార్తలపై సీనియర్ నటి రాధికా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వేణు ఆరోగ్యం నిలకడగా ఉందని.. కోమా అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదంటూ ట్విట్ చేశారు.

Also Read: Kamalpreet Kaur: టోక్యో ఒలంపిక్స్‌లో చరిత్ర సృష్టించిన పంజాబీ అమ్మాయి కమల్‌ప్రీతి కౌర్..