జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి కాదు…….డీలిమిటేషన్ ప్రక్రియపైనే చర్చకు ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ …?

జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి హోదా ప్రతిపాదనపై కాకుండా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వర్గీకరణ) పై చర్చించడానికే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

  • Publish Date - 6:21 pm, Sun, 20 June 21 Edited By: Phani CH
జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి కాదు.......డీలిమిటేషన్ ప్రక్రియపైనే చర్చకు ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ ...?

జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తి హోదా ప్రతిపాదనపై కాకుండా డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్వర్గీకరణ) పై చర్చించడానికే ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్దరించడానికి ప్రధాని ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని వచ్చిన ఊహాగానాలను ఇవి కొట్టిపారేశాయి. రాష్ట్ర హోదా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అందుకు ఇంకా తగిన సమయం రాలేదని ఈ వర్గాలు వివరించాయి. ఈ నెలారంభంలో మొదలైన పాలనాపరమైన కసరత్తుపై రాజకీయ పార్టీల నుంచి వాటి అభిప్రాయాలను సేకరించేందుకు మోదీ దీన్ని నిర్వహిస్తున్నారని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. కాశ్మీర్ కు రాష్ట్ర హోదాపై మొదట చర్చలు జరగాలి.. ఆ తరువాత పార్లమెంటు ఆమోదం అవసరం అని పేర్కొన్నాయి. ఈ కారణం వల్లే ఈ కేంద్ర పాలిత ప్రాంతానికి రాజ్యాంగంలోని 370 అధికరణం కింద స్పెషల్ స్టేటస్ ప్రసక్తి లేదు అని వెల్లడించాయి.

కాశ్మీర్ లోని అసెంబ్లీ, లోక్ సభ నియోజక వర్గాల పునర్వర్గీకరణ అనంతరమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. కాగా ఈ నెల 24 న జరిగే అఖిల పక్ష సమావేశానికి హాజరు కావలసిందిగా జమ్మూ కాశ్మీర్ లోని 8 పార్టీలకు ప్రధాని నుంచి ఆహ్వానం అందినప్పటికీ .. వీటిలో కొన్ని పార్టీలు ఈ మీటింగ్ కి హాజరు కావాలా..వద్దా అని ఇంకా చర్చలు కొనసాగిస్తున్నాయి. తమ కాశ్మీర్ కి తిరిగి రాష్ట్ర హోదాను కల్పించవచ్చునని..అందువల్లే దీనిపై తమ అభిప్రాయాలను తెలుసుకునేందుకే మోదీ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని ఆశించిన పార్టీల ఆశలు నీరుగారిపోయాయి. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి: అదనపు మ్యుటేషన్ గా మారుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ …..ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా ఆందోళన

Earthquake : దేశరాజధానిలో వరుస భూ ప్రకంపనలతో ఆందోళనలో హస్తిన వాసులు