అదనపు మ్యుటేషన్ గా మారుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ …..ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా ఆందోళన

బీ.1.617.2 స్ట్రెయిన్ కన్నా శక్తిమంతమైన డెల్టా ప్లస్ వేరియంట్..అదనపు (మరో) మ్యుటేషన్ గా మారుతోందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అన్నారు.

అదనపు మ్యుటేషన్ గా మారుతున్న డెల్టా ప్లస్ వేరియంట్ .....ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా ఆందోళన
Randeep Guleria
Follow us

| Edited By: Phani CH

Updated on: Jun 20, 2021 | 6:18 PM

బీ.1.617.2 స్ట్రెయిన్ కన్నా శక్తిమంతమైన డెల్టా ప్లస్ వేరియంట్..అదనపు (మరో) మ్యుటేషన్ గా మారుతోందని ఎయిమ్స్ చీఫ్ డా. రణదీప్ గులేరియా అన్నారు. దీన్ని కె 417ఎన్ గా వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. ఈ వేరియంట్ ని అదుపు చేయకపోతే ప్రమాదకరంగా మారుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కోవిద్ బిహేవియర్ (మాస్కుల ధారణ, భౌతిక దూరం పాటింపువంటివి) ని సక్రమంగా పాటించకపోతే ఈ వేరియంట్ మన దేశంలో వేగంగా విస్తరించవచ్చునన్నారు. ఇండియాలోని పలు రాష్ట్రాల్లో అన్-లాక్ ప్రారంభసమైన నేపథ్యంలో కోవిద్ కేసులు మళ్ళీ పెరగకుండా పటిష్టవంతమైన సర్వేలెన్స్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కె 417 ఎన్ అనే ఈ వేరియంట్ ను రానున్న వారాల్లో జాగ్రత్తగా గమనిస్తుండాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే హెచ్చరిక జారీ చేసిందన్నారు. ఈ స్ట్రెయిన్ ఇమ్యూనిటీని తప్పించుకోగలదని, దాన్ని దాటిపోగలదని కూడా గులేరియా పేర్కొన్నారు. ఇది ఎప్పటికప్పుడు మారుతోంది…..ఎక్కువ మందికి ఇది సోకే ప్రమాదం ఉంది అని ఆయన చెప్పారు. బ్రిటన్ లో తగిన సమయంలో దీన్ని అదుపు చేసినప్పటికీ ఆంక్షలు సడలించిన కారణంగా ,మళ్ళీ కోవిద్ కేసులు పెరిగాయన్నారు.

రానున్న మూడు, నాలుగు నెలలు మనం అప్రమత్తంగా ఉండాల్సిందే అని గులేరియా పేర్కొన్నారు. లేని పక్షంలో ఇదివరకటి పరిస్థితి తలెత్తవచ్చు అన్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ గత మార్చి నుంచే దేశంలో ఉందని, నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డా.వీ,కె. పాల్ చెప్పారు. దీని మ్యూటేషన్ కొత్త రూపు సంతరించుకుందని అన్నారు. కాగా కె 417 ఎన్ ఎక్కువగా యూరప్, అమెరికా, ఇతర ఆసియా దేశాల్లో ఉందని వినోద్ శారియా అనే నిపుణుడు వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Earthquake : దేశరాజధానిలో వరుస భూ ప్రకంపనలతో ఆందోళనలో హస్తిన వాసులు

IND Vs NZ, WTC Final 2021 Day 3 Live: వరుసగా వికెట్లు సమర్పించుకుంటున్న టీమిండియా.. లంచ్ టైమ్‌కి స్కోర్ 211/7

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..