Earthquake : దేశరాజధానిలో వరుస భూ ప్రకంపనలతో ఆందోళనలో హస్తిన వాసులు
రాజధాని ఢిల్లీలో ఇవాళ స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12:02 గంటల సమయంలో ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో భూమి..
Delhi Sees Low-Intensity Earthquake : రాజధాని ఢిల్లీలో ఇవాళ స్వల్ప తీవ్రతతో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 12:02 గంటల సమయంలో ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో భూమి కంపించింది. రికర్ట్ స్కేలుపై దీని తీవ్రత 2.1గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) ప్రకటించింది. నార్త్ వెస్ట్ ఢిల్లీకి 8 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. అయితే ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదు. అటు, గత నెల మే 31వ తేదీన కూడా దేశ రాజధానిలో భూమి కంపించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో రాత్రి వేళ అప్పుడు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 2.4 గా నమోదైంది. దాంతో రాత్రివేళ అక్కడి ప్రజలు ఒక్కసారిగా హడలిపోయారు. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో అప్పుడు కూడా ఎలాంటి ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ సంభవించలేదు. అయితే, తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ హస్తినలో వరుస భూకంపాలు అక్కడి ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి.
అసలు.. భూకంపం ఎందుకు సంభవిస్తుంది..?
భూమి అనేక పొరలుగా విభజించబడింది. భూమి క్రింద అనేక రకాల ప్లేట్లు ఉన్నాయి. అయితే కలిసి ఉన్న ప్లేట్లు భూమి లోపలి ఉష్ణోగ్రతల ఆధారంగా ఆ ప్లేట్లు అటూ ఇటూ కదులుతుంటాయి. ఫలితంగా భూకంపం సంభవిస్తుంటుంది. అయితే, ఇటీవలి కాలంలో దేశంలో తరచూ భూమి కంపిస్తూనే ఉంది.
భూకంపం సంభవించినప్పుడు ఏం చేయాలి.. ఏం చేయకూడదు :
1. భూమి కంపిస్తున్నట్లు అనిపించిన వెంటనే.. బలమైన టేబుల్ కింద కూర్చుని గట్టిగా పట్టుకోవాలి. 2. ప్రకంపనలు కొనసాగుతున్నంత కాలం లేదా మీరు సురక్షితంగా బయటపడే పరిస్థితి లేకపోతే అదే స్థలంలో కూర్చోవాలి. 3. మీరు ఎత్తైన భవనంలో నివసిస్తుంటే, కిటికీకి దూరంగా ఉండండి. 4. మీరు మంచంలో ఉంటే, అక్కడే ఉండి గట్టిగా పట్టుకోండి. మీ తలపై ఒక దిండు ఉంచండి. 5. మీరు బయట ఉంటే, అప్పుడు ఖాళీ ప్రదేశానికి వెళ్లండి. అంటే భవనాలు, ఇళ్ళు, చెట్లు, విద్యుత్ స్తంభాలకు దూరంగా. 6. మీరు డ్రైవింగ్ చేస్తుంటే, కారు వేగాన్ని తగ్గించి ఖాళీ స్థలంలో ఉంచండి. ప్రకంపనలు పోయే వరకు కారులో ఉండండి. 7. మీరు వెలుపల, రహదారిపై లేదా మార్కెట్లో ఉంటే, అప్పుడు భూమికి లేదా సమీప ప్రదేశానికి చేరుకోండి. 8. ఎత్తైన భవనాలకు దూరంగా నడవండి. 9. చెట్లు మరియు విద్యుత్ తీగలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
Read also : Tulasi Reddy : ‘బొంకరా బొంకరా పోలిగా అంటే.. టంగుటూరి మిరియాలు తాటికాయంతా’ అన్నట్లుంది : తులసిరెడ్డి