PM Modi: టీవీ9 గ్రూప్ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..

ఢిల్లీలో వాట్‌ ఇండియా థింక్స్‌ థీమ్‌తో గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహించిన TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9.. ఇప్పుడు జర్మనీలోని స్టుట్‌గాట్‌ నగరం వేదికగా మరో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తోంది. నవంబర్‌ 21 నుంచి 23వ తేదీ వరకు జరిగే సదస్సులో ప్రధాని మోదీ కూడా ప్రసంగిస్తారు.

PM Modi: టీవీ9 గ్రూప్ ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ కీలక ప్రసంగం..
Tv9 Md& Ceo Barun Das, Pm M
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 17, 2024 | 12:39 PM

భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో జర్మనీ లోని స్టుట్‌గాట్‌ ‌ నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జర్మనీలోని స్టుట్‌గాట్‌ నగరం MHP ఎరినాలో ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ కూడా సదస్సుకు వర్చువల్‌గా హాజరవుతారు. ప్రధాని మోదీతో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, కమ్యూనికేషన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా ఈ సదస్సుకు హాజరు కానున్నారు. అటు ఈ సదస్సులో ప్రధాని మోదీ ‘ఇండియా- ఇన్‌సైడ్ ది గ్లోబల్ బ్రైట్ స్పాట్’ అనే పేరిట కీలక ప్రసంగాన్ని చేయనున్నారు.

యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భారతదేశం నిబద్ధతతో ఉందని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కోనున్నారు. అక్టోబరులో ప్రధాని మోదీ, జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ద్వైవార్షిక ఇంటర్‌గవర్నమెంటల్ కన్సల్టేషన్స్(IGC)కి అధ్యక్షత వహించారు. ఇరుపక్షాలు క్రిమినల్ మ్యాటర్స్, రహస్య సమాచార అంశాలపై పరస్పర ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అలాగే ఆవిష్కరణ, సాంకేతికత కోసం రోడ్ మ్యాప్‌ను ఖరారు చేసుకున్నాయి. నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికుల రిక్రూట్‌మెంట్‌ను వేగవంతం చేయడానికి జర్మనీ కూడా అంగీకరించింది. వారికి వీసాల సంఖ్యను సంవత్సరానికి 20,000 నుంచి 90,000కు పెంచింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రారంభం ఒప్పందంపై సంతకాలు చేసుకున్నాయి ఇరు దేశాలు. ఇక ఈ ఒప్పందంతో లక్షలాది మంది కార్మికులకు ఉద్యోగాలు లభించనున్నాయి.

టీవీ 9 ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ మాట్లాడుతూ.. ‘ఇది గ్లోబల్‌ సమ్మిట్‌.. ఇలాంటి సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి.. భారత్‌లో నిర్వహంచిన సదస్సుకు కొనసాగింపుగా నిర్వహిస్తున్నాం.. ఓ మీడియా సంస్థ అంతర్జాతీయ సదస్సును నిర్వహించడం తొలిసారి కావడం విశేషం. 50 దేశాలకు పైగా ప్రతినిధులు హాజరయ్యారు. వాట్‌ ఇండియా థింక్స్‌ పేరిట ఢిల్లీ సదస్సు జరిగింది. మనం ఇప్పుడు సరిహద్దు లేని ప్రపంచంలో ఉన్నాం.. భారత్‌లో ఏం జరిగినా ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. అంతర్జాతీయ రాజకీయాల్లో, వ్యాపార రంగంలో ప్రభావం ఉంటుంది. ప్రపంచ ప్రజలను ప్రేక్షకులుగా భావించి భారత్‌లో సదస్సు నిర్వహించాం. దానికి కొనసాగింపుగా స్టుట్‌గాట్‌ ‌సదస్సు నిర్వహిస్తున్నాం. ఇండియా-జర్మనీ గ్లోబల్‌సమ్మిట్‌కు 200 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. స్టుట్‌గాట్‌‌‌ లోని ఫుట్‌బాల్‌ స్టేడియం ఈ సదస్సుకు వేదిక కానుంది. భారత్‌ , జర్మనీకి చెందిన రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతారని’ అన్నారు.

ఇవి కూడా చదవండి

Pm Modi Key Summit

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..