Crime News: ఛీ.. వ్యాక్.. మనిషి మాంసం ఎలా రా?.. వ్యక్తిని హత్య చేసి.. మృతదేహాన్ని ఇంటితీసుకెళ్లి మరీ
పశ్చిమ బెంగాల్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి శ్మశాన వాటిక సమీపంలో తిరుగుతున్న ఓ మానసిక వికలాంగుడైన వృద్ధుడిని హత్య చేసి అనంతరం అతని మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి తినేందుకు ప్రయత్నించాడు. విషయం వెలుగులోకి రావడంతో సదరువ్యక్తిని అరెస్ట్ పీఎస్ తరలించారు పోలీసులు.

ఓ వ్యక్తి శ్మశానం సమీపంలో తిరుగుతున్న వృద్ధుడిని చంపి అతని మాంసాన్ని తినాలని ప్లాన్ చేసిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బెహార్ జిల్లాలోని దిన్హాటా ప్రాంతంలో వెలుగు చూసింది. ఈ హత్య కేసులో అరెస్టైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించగా.. వృద్ధుడిని చంపి అతని మాంసాన్ని తినాలని ప్లాన్ చేసినట్టు ఒప్పుకున్నాడని.. కానీ ప్రయత్నాలు విఫలమవడంతో మృతదేహాన్ని కుర్షాహత్‌లోని ఒక చెరువులో పడేసినట్టు అంగీకరించినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. జనవరి 10, శనివారం, ఉత్తర బెంగాల్‌లోని కూచ్ బెహార్ జిల్లా దిన్హాటా ప్రాంతంలోని ఒక శ్మశాన వాటిక సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. అయితే మృతదేహం మెడపై కొరికిన గాయాలు కనిపించడంతో ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అయితే దర్యాప్తులో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఈ ఘటనపై దిన్హతా సబ్-డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) ధీమాన్ మిత్రా మాట్లాడుతూ, ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఫిర్దౌస్ ఆలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని.. విచారణలో నిందితుడు గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. అనంతరం ఆ మృతదేహాన్ని తన ఇంటికి తీసుకెళ్లి నీటితో పూర్తిగా శుభ్రం.. మాంసాన్ని తినాలని ప్లాన్ చేసినట్టు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. అయితే చనిపోయిన వ్యక్తి ఒక మానసిక వికలాంగుడని పోలీసులు గుర్తించారు.
నిందితుడి నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు అతన్ని కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు ఎదుట హాజరు పర్చారు పోలీసులు. దీంతో కోర్టు నిందితుడిని పోలీస్ కస్టడీకి అనుమతించింది. దీంతో అతన్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. అతన్ని మరింత ముమ్మరంగా విచారిస్తారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
