AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rahul on Modi: మోడీ బలహీనమైన ప్రధాని..ట్రంప్‌కు భయపడ్డారన్న రాహుల్ గాంధీ.. ఐదు ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్

రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే ప్రధాన ప్రతి పక్ష పార్టీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు. మోడీ ప్రభుత్వం భారత విదేశాంగ విధానాన్ని బలహీనపరుస్తోందని.. ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని ఆరోపించారు.

Rahul on Modi:  మోడీ బలహీనమైన ప్రధాని..ట్రంప్‌కు భయపడ్డారన్న రాహుల్ గాంధీ.. ఐదు ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్
Rahul On Modi
Surya Kala
|

Updated on: Oct 16, 2025 | 12:42 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచుగా తన ప్రకటనలతో వార్తల్లో నిలుస్తారు. అంతేకాదు ట్రంప్ చేసే ప్రకటనలు ఇతర దేశాలలో కూడా వివాదాన్ని రేకెత్తిస్తాయి. భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆపింది నేనే అంటూ ఆయన గతంలో అనేక ప్రకటనలు చేశారు. ఇప్పుడు భారతదేశం ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసి .. మన దేశంలో వివాదానికి ఆజ్యం పోశారు. గురువారం వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నా స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధం ఉంది” అని అన్నారు. ట్రంప్ ప్రకటన చేసిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలు చేశారు.

నరేంద్ర మోడీ మరోసారి దేశ గౌరవాన్ని దెబ్బతీశారని కాంగ్రెస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ Xలో పోస్ట్ చేసింది. ట్రంప్ కోపం, బెదిరింపులకు భయపడి, భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ఆపదని మోడీ భారతదేశానికి హామీ ఇచ్చారని చెప్పారు. అయితే ఇప్పుడు ఒక విషయం స్పష్టం అయింది.. నరేంద్ర మోడీ బలహీనమైన ప్రధానమంత్రి.. అతని చర్యలు దేశ విదేశాంగ విధానాన్ని నాశనం చేశాయని సంచలన ఆరోపణలు చేశారు. నరేంద్ర మోడీ.. రష్యా ఎల్లప్పుడూ భారతదేశానికి కీలక మిత్రదేశం. మీ స్వంత “హస్కీ సంబంధాన్ని” మెరుగుపరచుకోవడానికి దేశం సంబంధాలను నాశనం చేయవద్దని హితవు పలికింది.

ఇవి కూడా చదవండి

ట్రంప్‌ను చూసి మోడీ భయపడుతున్నారు: రాహుల్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనను అనుసరించి.. రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై దాడి చేశారు. సోషల్ మీడియా పోస్ట్‌లో రాహుల్ ప్రధాని మోడీకి ఐదు ప్రశ్నలు సంధిస్తూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్కడ తాను చిక్కుకుపోతానో అని భయపడుతున్నారని అన్నారు.

ట్రంప్ తానే నిర్ణయం తీసుకుని భారతదేశం రష్యా చమురు కొనుగోలు చేయదని ఎందుకు ప్రకటించాడు.

పదేపదే నిర్లక్ష్యం చేసినప్పటికీ.. ట్రంప్ ఎందుకు అభినందన సందేశాలు పంపుతూనే ఉన్నాడు.

ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నారు

షర్మ్ ఎల్-షేక్ కు ఎందుకు హాజరు కాలేదు

ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ వ్యాఖ్యలను ఎందుకు ఖండించడం లేదు.? అనే ప్రశ్నలు సంధించారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెప్పారు? భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుంది. దీనిపై అమెరికా పదేపదే తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. అంతే కాదు చమురు కొనుగోళ్లపై అమెరికా భారతదేశంపై అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తే ఈ సుంకాన్ని తగ్గిస్తామని అమెరికా పేర్కొంది.

గురువారం వైట్ హౌస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. “ప్రధాని నరేంద్ర మోడీ నా స్నేహితుడు. మాకు చాలా మంచి సంబంధం ఉంది. భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం పట్ల నేను సంతోషంగా లేను.. అయితే ఈ రోజు ఆయన (ప్రధాని మోడీ) రష్యా నుంచి చమురు కొనుగోలు చేయనని నాకు హామీ ఇచ్చారు. ఇప్పుడు మనం చైనాను కూడా ఇదే విధంగా చమురు కొనుగోలు చేయకుండా చేయించాలి” అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..