AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO Jobs 2025: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. రూ.లక్షన్నర జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా..

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌, సైంటిస్ట్‌, ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (ఇస్రో) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషణ్‌ కింద మొత్తం 141 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు..

ISRO Jobs 2025: పదో తరగతి పాసైన వారికి గుడ్‌న్యూస్.. రూ.లక్షన్నర జీతంతో ఇస్రోలో ఉద్యోగాలు! దరఖాస్తు ఇలా..
ISRO SDSC SHAR Recruitment
Srilakshmi C
|

Updated on: Oct 16, 2025 | 2:48 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో శ్రీహరి కోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (ఇస్రో).. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్‌, సైంటిస్ట్‌, ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషణ్‌ కింద మొత్తం 141 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

పోస్టుల వివరాలు ఇవే..

  • సైంటిస్ట్‌/ఇంజినీర్‌-ఎస్‌సీ పోస్టుల సంఖ్య: 23
  • టెక్నికల్ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 28
  • సైంటిఫిక్‌ అసిస్టెంట్‌ పోస్టుల సంఖ్య: 3
  • లైబ్రరీ అసిస్టెంట్‌-ఏ పోస్టుల సంఖ్య: 1
  • రేడియోగ్రాఫర్‌-ఏ పోస్టుల సంఖ్య: 1
  • టెక్నీషియన్‌-బీ పోస్టుల సంఖ్య: 70
  • డ్రాట్ర్స్‌మెన్‌-బీ పోస్టుల సంఖ్య: 2
  • కుక్‌ పోస్టుల సంఖ్య: 3
  • ఫైర్‌మెన్‌-ఏ పోస్టుల సంఖ్య: 6
  • లైట్‌ వెహికిల్‌ డ్రైవర్‌-ఏ పోస్టుల సంఖ్య: 3
  • నర్స్‌-బీ పోస్టుల సంఖ్య: 1

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా (నర్సింగ్‌), డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, ఎంఈ, ఎంటెక్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి 2025 నవంబర్‌ 14వ తేదీ నాటికి తప్పనిసరిగా సైంటిస్ట్‌/ఇంజినీర్‌-ఎస్‌సీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు, మిగతా పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఈ అర్హతలు ఉన్నవారు ఎవరైనా ఆన్‌లైన్ విధానంలో నవంబర్‌ 14, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద సంబంధిత పోస్టులకు రూ.500 నుంచి 750 వరకు జనరల్‌ అభ్యర్ధులు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఈ కింది విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు.

జీతాల వివరాలు..

  • సైంటిస్ట్‌/ఇంజినీర్‌ పోస్టులకు నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500 వరకు
  • టెక్నికల్ అసిస్టెంట్‌, సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్‌ పోస్టులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు
  • రేడియోగ్రాఫర్‌ పోస్టులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు
  • టెక్నీషియన్‌-బీ, డ్రాట్స్‌మెన్‌ పోస్టులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు
  • నర్స్‌-బీ పోస్టులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు
  • కుక్‌, డ్రైవర్‌, ఫైర్‌మెన్‌ పోస్టులకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు

ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌