8 Yrs Of Modi Govt: మోదీ ప్రభుత్వానికి బూస్టర్ డోస్ ఈ సర్వే.. ఏకంగా 67 శాతం మంది ప్రజలు..!
8 Yrs Of Modi Govt: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పని చేసిందని ప్రజలు విశ్వసిస్తున్నారు.
8 Yrs Of Modi Govt: కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చాలా సమర్థవంతంగా పని చేసిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. లోకల్ సర్కి్ల్ చేపట్టిన పోల్‌లో మోదీ పాలనపై జనాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ సర్వేలో 64,000 మంది అభిప్రాయాలు సేకరించగా.. దాదాపు 67 శాతం మంది మోదీ విధానాలను సమర్థించారు. దేశంలో కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, ముఖ్యంగా రెండవ దశలో కరోనా కట్టడిలో ప్రభుత్వ చర్యలు జనాలను అంచనాలను అందుకుందా? లేదా? అనే దానికి.. అంచనాలను మించి పని చేసిందని జనాలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సోమవారం నాటికి ఎనిమిదేళ్లు పూర్తి అయ్యాయి. మే 26న ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. 30న ప్రధానిగా ఛార్జ్ తీసుకున్నారు. అయితే, దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, నిరుద్యోగం పెరుగుతున్న తరుణంలో ఈ సర్వేలు బీజేపీ సర్కార్‌లో కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. కోవిడ్ రెండో దశలో డెల్టా వైరస్ విజృంభణ సమయంలో మరణాల సంఖ్య భారీగా పెరగడం, దేశ ఆరోగ్య వ్యవస్థ క్షీణించినప్పటి కంటే కూడా ఇప్పుడు మోదీకి రెండింతల మద్ధతు జనాల నుంచి రావడం ప్రభుత్వానికి ప్లస్ పాయింట్‌గా మారింది.
అయితే, ఈ సర్వేలో పాల్గొన్నవారు పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభం చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు, ధరల పెరుగుదల విషయంలో మోదీ ప్రభుత్వానికి 37 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. ఇదే అంశంలో 2021లో సర్వే చేయగా.. 27 శాతం మంది, 2020లో 29 శాతం మంది మాత్రమే మద్ధతు తెలిపారు. ఇక ద్రవ్యోల్బణంపై 73 శాతం మంది ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా పెరుగుతున్న ధరలను ఏమాత్రం అదుపు చేయడం లేదని అన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇది ప్రధాన సమస్యగా అవతరించే అవకాశం ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే.. మోడీ ప్రభుత్వం ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా సోమవారం ప్రచురించబడిన ఈ సర్వేలో 60 శాతం మంది మోడీ ప్రభుత్వం దేశంలో మత సామరస్యాన్ని మెరుగుపరిచిందని విశ్వసించగా, 33 శాతం మంది అంగీకరించలేదు.